Breaking News

26/07/2018

రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్.... ‘పట్నఘడ్ 23 ఫిబ్రవరి 2018‘

(way2newstv.in) 
కొత్తగా పెళ్లయిన ఓ జంట ఐదు రోజుల తర్వాత వెడ్డింగ్ గిప్ట్ అందుకుంటారు. దాన్ని ఓపెన్ చేయగానే బాంబు పేలి వరుడు, అతని అమ్మమ్మ చనిపోయారు. వధువు తీవ్రంగా గాయపడింది. ప్రశాంతంగా వున్న పట్నఘడ్ ఆ సంఘటనతో ఒక్కసారి ఉలిక్కి పడింది. ఈ సంఘటనను ప్రేరణగా తీసుకొని , క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిలర్ ను... నేషనల్ అవార్డు విన్నర్, ఇంటర్నేషనలీ అక్లైమ్డ్ డైరెక్టర్ రాజేష్ టచ్రివర్ ‘పట్నఘడ్ 23 ఫిబ్రవరి,2018, ఒడిషా అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అతుల్ కులకర్ణి, మనోజ్ మిశ్ర, తనికెళ్ల భరణి, యశ్ పాల్ శర్మ,షిజ్జు,సంజు శివరామ్, రేవతి సంపత్, చిన్మయ్ మిశ్ర, అంకిత, ఇషిక సింగ్, పుష్ప పండా, ప్రధాన తారాగణంగా  రూపొందుతున్న ఈ చిత్రం రేంజ్ రాయల్ సినీ ల్యాబ్స్ పతాకంపై శ్రీధర్ మార్తా నిర్మిస్తున్నారు. 



రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్.... ‘పట్నఘడ్ 23 ఫిబ్రవరి 2018‘ 

ఈ సందర్భంగా రాజేష్ టచ్రివర్ మాట్లాడుతూ...‘ఒడిషాలో జరిగిన కథను ఆధారంగా తీసుకొని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇది ఒడిషా లో జరిగిన సంఘటన కాబట్టి. ఒడిషా, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అతుల్ కులకర్ణి నటిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ సాగే తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సహజత్వంతో కూడిన సన్నివేశాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి నిస్తుంది అన్నారు. నిర్మాత శ్రీధర్ మార్తా మాట్లాడుతూ ‘ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అత్యున్యత సాంకేతిక విలువలు వుంటాయి. ‘మహానటి’, జనతా గ్యారేజ్, భరత్ అను నేను చిత్రాలకు  సౌండ్ డిజైన్ చేసిన తపస్ నాయక్ ఈ చిత్రానికి సౌండ్ డిజైన్ చేస్తున్నారు. పాస్తటిక్ మేకప్ డిజైనింగ్ లో ఇండియాలో పేరున్న ఎన్.జి రోషన్ ఈ చిత్రం కోసం స్పెషల్ మేకప్ చేయడానికి రెస్పాన్సబిలిటీ తీసుకున్నారు.బాలీవుడ్ చిత్రాలు 102 నాట్ అవుట్ చిత్రానికి సంగీతాన్ని అందించిన జార్జ్ జోసఫ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ అందించిన ఫోక్ సాంగ్స్ అన్నీ విశేషాదరణ పొందాయి. ప్రస్తుతం ఈ చిత్రం కోసం ఆయన ఒక సంబల్ పూర్ ఫోక్ సాంగ్ ను కంపోజ్ చేస్తుండటం విశేషం. ఇష్క్, ఫిధా, గమ్యం, ప్రస్థానం, నా బంగారు తల్లి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన రాజీవ్ నాయర్... ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం‘ అన్నారు.
ఈ చిత్రానికి మాటలు: రవి.కె.పున్నం, ఆర్ట్: రాజీవ్ నాయర్, స్పెషల్ మేకప్ డిజైన్: ఎన్.జి. రోషన్, సౌండ్ డిజైనింగ్: తపస్ నాయక్, సంగీతం: జార్జ్ జోసఫ్, స్పెషల్ ఫోక్ సాంగ్: ఆర్ .పి.పట్నాయక్, కెమెరా: జె.డి. రామ తులసి, సహ నిర్మాతలు: మనోజ్ మిశ్రా, పద్మశ్రీ సునీతా క్రుష్ణన్, నిర్మాత: శ్రీధర్ మార్తా, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: రాజేష్ టచ్ రివర్.

No comments:

Post a Comment