హైదరాబాద్ జనవరి 4, (way2newstv.in)
గచ్చి బౌలిలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ను హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ శనివారం ఉదయం పునప్రారంభించారు. గత నవంబర్ 23 న ఫ్లై ఓవర్ పై కారు ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఫ్లైఓవర్ ను మూసివేసారు. ఫ్లై ఓవర్ పై కారు ప్రమాదం తర్వాత నిపుణుల కమిటీ సూచనల మేరకు..స్పీడ్ లిమిట్ కంట్రోల్ కోసం చర్యలను జిహెచ్ఎంసి పూర్తి చేసింది.
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మేయర్
ముందుగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ తో కలిసి మేయర్ ఫ్లై ఓవర్ ను పరిశీలించారు. మేయర్ మాట్లాడుతూ నిపుణుల కమిటీ సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం. వేగం 40 కంటే మించకూడదన్నారు. స్పీడ్ లిమిట్ కంట్రోల్ కోసం చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. వాహనాల వేగం, వాహనదారుల ప్రవర్తనను నెల రోజుల పాటు పరిశీలిస్తామని అయన చెప్పారు. రోజువారీగా నివేదికను నిపుణుల కమిటీకి పంపిస్తామన్నారు. నివేదిక తర్వాత నిపుణుల కమిటీ సూచన మేరకు మరిన్ని ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment