న్యూఢిల్లీ జనవరి 7 (way2newstv.in)
మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అనర్హత వేటును సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును భూపతిరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బొబ్డే స్పష్టం చేశారు. 2019లో ఎమ్మెల్సీ భూపతి రెడ్డిపై శాసనమండలి చైర్మన్ అనర్హత వేటు వేసిన విషయం విదితమే. టీఆర్‌ఎస్ పార్టీ తరపున మండలికి ఎన్నికైన భూపతిరెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో భూపతిరెడ్డిపై నాటి చైర్మన్ అనర్హత వేటు వేశారు. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన భూపతిరెడ్డికి అక్కడ చుక్కెదురైంది. చైర్మన్ ఆయనను అనర్హుడిగా ప్రకటించడాన్ని నాడు హైకోర్టు సమర్థించింది.
మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
అనర్హుడిగా ప్రకటించడంలో ఎలాంటి చట్టవిరుద్ధమైన అంశాలు తమకు కనిపించలేదని, రాజ్యాంగంలో షెడ్యూల్ 10లోని 8వ పేరా సమర్థనీయమేనని కోర్టు స్పష్టం చేసింది. శాసన మండలి అనర్హత నిబంధనల్లోని 7(4) రాజ్యాంగబద్ధమేనని పేర్కొన్న హైకోర్టు, భూపతిరెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది.రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు 8వ పేరా మౌలిక నిర్మాణ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. మండలి ఛైర్మన్‌కు అధికారం కల్పించే ఈ నిబంధన రాజ్యాంగ పరిధిలోనే ఉందని, ఇది చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. అంతేకాదు తెలంగాణ శాసనమండలి అనర్హత నిబంధనల్లోని 7(4) రాజ్యాంగ విరుద్ధమనడానికి ఎలాంటి ఆధారాల్లేవని తెలిపింది. భూపతిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించడంలో ఎలాంటి చట్ట ఉల్లంఘనలూ లేవని, నిబంధనలకు లోబడే ఆయన నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. భూపతిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేసింది హైకోర్టు.
No comments:
Post a Comment