రాజమండ్రి, జనవరి 25, (way2newstv.in)
ఇటు కృష్ణాజిల్లా గన్నవరం, అటు విశాఖకు మధ్యలో ఉన్న రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో ఎయిర్ ట్రాఫిక్ శరవేగంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ సర్వీసులతో హై ఎయిర్‌వేగా అభివృద్ధి చెందుతోంది. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టుకు గన్నవరమైనా, విశాఖ అయినా 200 కిలోమీటర్ల దూరం వల్ల రాజమహేంద్రవరం కేంద్రంగా ప్రాధాన్యత పెరిగింది. ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు కోటి మందికి పైగా విమానసేవలు ఉపయోగకరంగా వున్నాయి.రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో ఎయిర్ ట్రాఫిక్ రోజురోజుకీ పెరుగుతోంది. ఈ కారణంగా మరిన్ని సర్వీసులను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రాజమండ్రికి పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్
ఈ నేపథ్యంలో మొదటగా మార్చి 29 నుంచి రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి కొత్త సర్వీసు ప్రారంభం కానుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఈ సర్వీసు ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టులో 26 విమాన సర్వీసులు వున్నాయి. రాజమహేంద్రవరం హైదరాబాద్, రాజమహేంద్రవరం చెన్నై, రాజమహేంద్రవరం బెంగుళూరు, రాజమహేంద్రవరం విశాఖ సర్వీసులు తిరుగుతున్నాయిఉడాన్ పధకం కింద కొన్ని కొత్త విమాన సర్వీసులు రానున్నాయి. ఈ పధకం కింద రాజమహేంద్రవరం-షిర్డీ, రాజమహేంద్రవరం నుంచి గోవా, రాజమహేంద్రవరం ముంబై, రాజమహేంద్రవరం విజయవాడ సర్వీసులను త్వరలో ప్రాంతీయ విమాన సర్వీసులు రానున్నాయి. దీనికితోడు ఎయిర్‌బస్-320 ఎయిర్‌లైన్స్ సంస్థ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కోసం ప్రయత్నిస్తోంది. ఈ సబ్సిడీలకు ఆమోదం లభిస్తే రాజమహేంద్రవరం న్యూఢిల్లీ వయా హైదరాబాద్, రాజమహేంద్రవరం ముంబై వయా హైదరాబాద్, రాజమహేంద్రవరం భువనేశ్వర్ వయా కోల్‌కత్తా ఎయిర్‌బస్ 320 ఎయిర్‌లైన్స్ సర్వీసులు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా వుంది. ఓఎన్జీసీ, గెయిల్ కార్యకలాపాలు విస్తరించడం, ఉత్తరాంధ్ర నుంచి విశాఖ రద్దీగా వుంటే అతి సమీపంలో 200 కిలో మీటర్ల దూరంలో వున్న రాజమహేంద్రవరం విమానాశ్రయం కేంద్రంగా వుండటంతో విస్తృతంగా ట్రాఫిక్ అభివృద్ధి చెందుతోంది. పోర్టు అనుబంధ కార్గొ, పీసీపీఐఆర్, కోస్టల్ కారిడార్, రిఫైనరీలు, ఎస్‌ఈజెడ్‌ల పారిశ్రామిక అభివృద్ధికి ఈ విమానాశ్రయం చాలా కీలకంగా మారనుంది. విశాఖకు ప్రత్యామ్నాయంగా రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు విస్తరిస్తోంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో దిగి ఇటు విశాఖకు, ఇటు గన్నవరం వెళ్లేందుకు కూడ ఈ ఎయిర్‌పోర్టును కేంద్రంగా మారింది. రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టులో త్వరలో కార్గో కూడ సర్వీసులు కూడ మొదలు కానున్నాయి. పాత టెర్మినల్‌ను కార్గొకు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫ్లోరీ కల్చర్ విస్తరణకు, ఈ ప్రాంత వ్యవసాయ ఉత్పత్తులకు అనువుగా సమీపంలో కోల్డ్ స్టోరేజీలతో ఎయిర్‌పోర్టు కార్గోపరంగా విస్తరిస్తోంది. కడియం పూలు, నర్సరీ ఉత్పత్తులకు ఉపయోగకరంగా కార్గో విస్తరిస్తోంది. ఏదేమైనప్పటికీ కొత్త సంవత్సరంలో తిరుపతి సర్వీసుతో కొత్త విమాన సర్వీసులు మొదలు కానున్నాయి.
No comments:
Post a Comment