Breaking News

08/01/2020

గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ఉండేలా శాశ్వత చర్యలు చేపట్టాలి

ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితాసబర్వాల్
వనపర్తి  జనవరి 08, (way2newstv.in):
గ్రామాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా శాశ్వత చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు.రెండవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆమె వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్న మందడి, మంగంపల్లి,  గ్రామాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ ఎస్ డి మరియు తెలంగాణకు హరితహారం ప్రత్యేక తెలంగాణ కార్యక్రమం అధికారి ప్రియాంక వర్గీస్ తో కలిసి పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.ముందుగా వీరు చిన్న మందడి గ్రామంలో పర్యటించి ఇంకుడు గుంతలు, గ్రామంలో పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డు, స్మశాన వాటిక లను పరిశీలించారు. 
గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ఉండేలా శాశ్వత చర్యలు చేపట్టాలి

గ్రామంలో హరితహారం కింద నాటిన మొక్కల కు ట్రీ గార్డ్ లను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి మొక్కకు ఒక సంఖ్యను ఏర్పాటు చేసి మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమని ఓ ఎస్ డి ప్రియాంక వర్గీస్ అన్నారు.అనంతరం గ్రామ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ మాట్లాడుతూ చిన్న మందడి గ్రామంలో సర్పంచ్ తో పాటు గ్రామాభివృద్ధికి ఏర్పాటుచేసిన వివిధ కమిటీల పనితీరు అభినందనీయమని, ముఖ్యంగా శానిటేషన్, హరిత కమిటీ, విద్యుత్, మార్కెట్ కమిటీ వంటి కమిటీలు గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలు, హరితహారం కింద పచ్చదనాన్ని పెంచేందుకు తీసుకున్న చర్యలు అభినందించేవిగా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆమె చిన్న మందడి గ్రామం పరిశుభ్రతతో పాటు అన్ని అంశాలలో ప్రగతి సాధించడానికి తీసుకున్న చర్యలను  గ్రామ సర్పంచ్ సూర్య చంద్ర రెడ్డి, గ్రామ పంచాయితీ కమిటీల సభ్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.చెత్త సేకరణకు రీక్షాల ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఇంటికి చెత్త బుట్టలను పంపిణీ చేయడంతో పాటు, రోడ్లపై చెత్త వెయ్యకుండా రోడ్డుకి ఇరుపక్కల చెత్త కుండీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతిరోజు ఉదయం 6:30 కి శానిటేషన్ సిబ్బంది చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారని, రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటడం తో పాటు, కమ్యూనిటీ ప్లాంటేషన్ చేపట్టడం జరిగిందని, మొక్కలు చనిపోకుండా నీరు  పెట్టడంతోపాటు చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవాటిని నాటుతున్న మని పచ్చదనం కమిటీ సభ్యులు వివరించారు. గ్రామపంచాయతీ విద్యుత్ బిల్లు నెలకు 17 వేల రూపాయలు వచ్చిందని తెలుసుకున్న స్మితా సబర్వాల్ మాట్లాడుతూ విద్యుత్తు వినియోగాన్ని ఆదా చేయాలని, అలాగే విద్యుత్ బిల్లు చెల్లించడంలో గ్రామపంచాయతీ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణపై మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరుగా చేయటం చాలా ముఖ్యమని, చెత్త నిర్వహణతో పాటు ఎప్పటికప్పుడు మురికి కాల్వలను, రహదారులను శుభ్రం చేసుకుంటే దోమల శాతం తగ్గుతుందని అన్నారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా వుంటూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగటం తో పాటు గ్రామం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా శాశ్వత చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ గణేష్, డి పి ఓ రాజేశ్వరి, ఆర్ డి ఓ కే చంద్రారెడ్డి, జిల్లా అధికారులు, ఎంపీపీ మెగా రెడ్డి, మంగంపల్లి గ్రామ సర్పంచ్ శారద తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్, స్మితా సబర్వాల్ ల గ్రామం వెలుపల ఉన్న నర్సరీని సందర్శించి అక్కడ పెంచుతున్న మొక్కలను, విత్తనాలను సంచులలో మట్టి నింపడం పరిశీలించారు. జనవరి 15 నాటికి మట్టి నింపటం పూర్తిచేయాలని ఆదేశించారు.

No comments:

Post a Comment