Breaking News

03/01/2020

'నమస్తే నేస్తమా`చిత్రానికి థియేటర్స్ లో 80పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉండడం సంతోషంగా ఉంది

దర్శక నిర్మాత  కె.సి బొకాడియా.
యానిమల్స్ మెయిన్ క్యారెక్టర్ లో రూపొందిన చిత్రాల‌న్నిసూపర్ హిట్స్ సాధించాయి. ఒక డాగ్ ప్రధాన పాత్రలో జాకీ ష్రాఫ్ హీరోగా కె. సి బొకాడియా అందించిన 'తేరి మెహెర్బానియా'  గోల్డెన్ జూబ్లీ హిట్ అయింది. ఆ చిత్రం ఇన్స్పిరేషన్ తో 'తేరి మెహెర్బానియా' పార్ట్ 2గా కె. సి బొకాడియా దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం 'నమస్తే నేస్తమా'. జనవరి 3న గ్రాండ్ గా విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో..దర్శక నిర్మాత కె. సి బొకాడియా మాట్లాడుతూ  - "ఈ రోజు విడుదలైన మా 'నమస్తే నేస్తమా' చిత్రం ఆర్టిసి క్రాస్ రోడ్ లో 80పర్సెంట్ ఆక్యుపెన్సీ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.  గతంలో యానిమల్స్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రాల‌న్నిసూపర్ హిట్ అయ్యాయి. 
 'నమస్తే నేస్తమా`చిత్రానికి థియేటర్స్ లో 80పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉండడం సంతోషంగా ఉంది

ఇప్పుడు ఆ కోవలోనే `నమేస్తే నేస్తమా` చిత్రం నిలవబోతుంది. మా సినిమాలో పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా ఇంతబాగా రిసీవ్ చేసుకున్న తెలుగు ప్రేక్షకులకు హృదయ పూర్వక ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల ప్రజలు యానిమల్ మూవీస్ అని చాలా బాగా ఆదరిస్తారు. ఈ సినిమాని కూడా తప్పకుండా ఆదరిస్తారు అని నాకు సపోర్ట్ చేసిన బ్రహ్మానందం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ చిత్రం షూటింగ్ లో నాకు పూర్తి సహకారం అందించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు థాంక్స్. రెండు కుక్కలతో సినిమా చేయడం చాలా కష్టం. అయినా దాదాపు 100 రోజులు ఆ డాగ్స్ తో షూటింగ్ చేశాం. రెండు కుక్కలు అద్భుతంగా పెర్ఫామ్ చేశాయి. అలాగే నాజర్‌, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర క్యారెక్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.  
రాజస్థాన్‌ లోని చిన్న గ్రామం నుండి వచ్చి బొంబాయిలో ఉన్న హైకాంపిటేషన్‌ని తట్టుకొని 1972లో సంజీవ్‌ కుమార్‌తో 'రివాజ్‌' సినిమాను నిర్మించాను. ఆతరువాత దర్శకుడిగా నా మొదటి సినిమా అమితాబ్‌ బచ్చన్‌ గారితో చేశాను. ఆ తర్వాత మితున్ చక్రవర్తి తో 'ప్యార్ జాప్తా నై' చేశాను. మంచి సక్సెస్ సాధించింది. అలాగే  ఒక డాగ్ ప్రధాన పాత్రలో జాకీ ష్రాఫ్ తో తీసిన 'తేరి మెహెర్బానియా'  గోల్డెన్ జూబ్లీ హిట్ అయింది. ఇలా  రజినీకాంత్‌, షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్,  అక్షయ్‌కుమార్‌, అజయ్‌దేవగన్‌, ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్, శ్రీదేవి, జయప్రద, ఇలా 100కు పైగా స్టార్ హీరోలతో, స్టార్ హీరోయిన్లతో వర్క్ చేశాను. అతి తక్కువ సమయంలో 50 సినిమాలు తీశాను. ప్రస్తుతం భారతదేశంలో తెలుగు ఇండస్ట్రీయే బెస్ట్‌ ఇండస్ట్రీగా ఉంది. ఇక్కడ హిట్ అయినా సినిమాలు అన్ని భాషలలో రీమేక్, డబ్బింగ్ చేస్తున్నారు. తెలుగులో, హిందీలో  కంటిన్యూ గా మంచి సినిమాలు నిర్మించాలనుకుంటున్నా" అన్నారు.చిత్ర సమర్పకులు గౌతమ్‌చంద్‌ రాథోర్‌ మాట్లాడుతూ - "మాది రాజస్థాన్. గత 30 సంవత్సరాలుగా నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. బొకాడియా గారు మాకు సన్నిహితులు. ఆయన చాలా హార్డ్ వర్కర్. ఆయన హార్డ్ వర్కే ఆయన్ను ఈ స్థానంలో నిలబెట్టింది. `నమస్తే నేస్తమా` చిత్రానికి మంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయం మాకు  తెలుగులో మరిన్ని సినిమాలు నిర్మించడానికి ఉపయోగపడుతుంది. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాల‌ని కోరుకుంటున్నాను" అన్నారు.శ్రీరామ్‌, ఈషానియ మహేశ్వరి, నాజర్‌, బ్రహ్మానందం, షాయాజీ షిండే, తాగుబోతు రమేష్‌, చమక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అజ్మల్‌ఖాన్‌, సంగీతం: బప్పిలహరి, చరణ్‌ అర్జున్‌, ఎడిటర్‌: బి. లెనిన్‌, ఫైట్స్‌: బి.జె శ్రీధర్‌, సమర్పణ: లలిత్‌ మోడీ, గౌతమ్‌చంద్‌ రాథోర్‌, కో-ప్రొడ్యూసర్‌: ఎస్‌.ఆర్‌ చాప్లాట్‌, నిర్మాత: బి.ఎం.బి మ్యూజిక్‌ అండ్‌ మాగ్నెటిక్స్‌ లిమిటెడ్‌, ర‌చ‌న‌- దర్శకత్వం: కె.సి. బొకాడియా.

No comments:

Post a Comment