Breaking News

17/12/2019

పట్టాలెక్కనున్న అదిలాబాద్ టూ నిజామాబాద్ రైల్వే లైన్

హైద్రాబాద్, డిసెంబర్ 17, (way2newstv.in)
ఆదిలాబాద్‌ నుంచి ఆర్మూర్‌ రైల్వే నిర్మాణ పనులపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు నడుస్తున్నాయని దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్‌ జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా అన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ను సందర్శించి, నూతనంగా ఏర్పాటు చేసిన గ్యాంగ్‌మెన్‌రూమ్‌లతో పాటు పోలీసు భద్రత, విశ్రాంత గదులను ప్రారంభించారు. స్టేషన్‌లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఏడాదికోసారి నిర్వహించే తనిఖీల్లో భాగంగానే ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు.
పట్టాలెక్కనున్న అదిలాబాద్ టూ నిజామాబాద్ రైల్వే లైన్

ఆదిలాబాద్‌ రైల్వేస్టేషన్‌తో పాటు ముథ్కేడ్‌, నాందేడ్‌ రైల్వేస్టేషన్‌లను తనిఖీ చేస్తామని తెలిపారు. త్వరలో జిల్లా నుంచి విద్యుత్‌ లైన్‌ పనులను ప్రారంభిస్తామనీ, ఆదిలాబాద్‌ నుంచి పిప్పల్‌కోటి వరకు పనులను పరిశీలించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ రాకపోవడంతోనే బ్రిడ్జిలు, రైల్వే ట్రాక్‌ పనులు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. దీర్ఘకాలిక సమస్య అయిన ఆదిలాబాద్‌ టూ ఆర్మూర్‌ రైల్వే పనులు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయని తెలిపారు. త్వరలో జిల్లాకు కొత్త రైళ్లను రప్పించే ఆలోచన ఉందన్నారు. జిల్లా కేంద్రం నుంచి ఇప్పటికే తిరుపతి, కలకత్తా, ఢిల్లీ వంటి నగరాలకు రైల్వే సేవలు అందిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ వాటా వచ్చిన తర్వాత ప్రారంభించనున్నారు.

No comments:

Post a Comment