Breaking News

06/12/2019

భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్‌

నల్గొండ, నవంబర్ 6, (way2newstv.in)
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి  కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం నెల రోజుల పాటు ప్రత్యేక గ్రీవెన్స్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం భూ ప్రక్షాళన సందర్భంగా పాత పాస్‌పుస్తకాల స్థానంలో కొత్త పాస్‌ పుస్తకాలను ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు లేని భూములను కేటగిరీ–ఏలో, సమస్యలు ఉన్న వాటిని కేటగిరీ–బీలో చేర్చారు. ఏ–కేటగిరీలో ఉన్న భూములకు సంబంధించి పాస్‌ పుస్తకాల పంపిణీ 95శాతం పైబడి పూర్తయ్యాయి.పార్ట్‌–బీలోనే సమస్యలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 4,46,345 పట్టాదారు పాస్‌ పుస్తకాలకు సంబంధించి డిజిటల్‌ సంతకాలు అయ్యాయి. అందులో 4,35,350 పాస్‌ బుక్‌లు రైతులకు అందించారు. 7,294 పాస్‌ పుస్తకాలు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. 12,488 నాన్‌ అగ్రికల్చర్‌ ఖాతాలను పరిష్కరించారు. ఇదిలా ఉంటే బీ– కేటగిరీలో దాదాపు 23,161 వరకు పెండింగ్‌ ఖాతాలు ఉన్నాయి. 
భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్‌

కాగాఇటీవల చందంపేట మండలంలో అటవీభూములకు అధికారులు అక్రమంగా పాస్‌ పుస్తకాలు జారీ చేయగా.. ప్రస్తుతం వాటిని రద్దు చేశారు.జిల్లాలో బీ–కేటగిరీలో ఉన్న పెండింగ్‌ ఖాతా లను పరిష్కరించేందుకు ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై నిత్యం రైతులు ఉన్నతాధికారుల వద్దకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జ్‌ కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ వనమాల చంద్రశేఖర్‌ రెండు మాసాల క్రితమే ఈ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే కలెక్టర్‌ బదిలీ కావడంతో ఆయన ఇన్‌చార్జ్‌ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది.ఇటీవల తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెవె న్యూ అధికారులు భయాందోళనకు గురయ్యా రు. విధులు బహిష్కరించారు. కేటీఆర్‌ హామీ తో ఇటీవలే విధుల్లో చేరిన విషయం తెలిసిందే. కాగా తహసీల్దార్ల బదిలీలు కూడా అవు తా యన్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆ లస్యమైంది. తహసీల్దార్ల బదిలీలు పూర్త వ్వడంతో ఈ కార్యక్రమం ముందుకు పోనుంది. గ్రామస్థాయిలో వీఆర్‌ఏ, వీఆర్‌ఓలతో పాటు రెవెన్యూ సిబ్బందితో సమావేశం ఉంటుంది. ఆయా డివిజన్ల వారీగా ఉన్న పెండింగ్‌ సమస్యలను క్షుణ్ణంగా చర్చిస్తారు. ఏయే ఖాతా, ఏ స్థాయిలో నిలిచిపోయింది. ఆ ఖాతా స్వరూపమేంటీ, ప్రస్తుతం తహసీల్దారా, ఇతర సిబ్బంది స్థాయిలో ఆగిపోయిందా, ఆగితే ఎందుకు ఆగింది అనే విషయాలపై చర్చిస్తారు. అందులో వీలైనన్ని ఖాతాలను పరిష్కరిస్తారు. మిగతా వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై చర్చిస్తారు. ఒకవేళ పరిష్కారం కాకపోతే రాత పూర్వకంగా ఆ ఖాతాదారుడు ఏ అధికారి వద్దకు వెళ్లాలనేది తెలియజేస్తారు.నెలరోజులపాటు ప్రతి సోమవారం ఇది ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో గ్రీవెన్స్‌ ఏర్పాటు చేసి ఎవరైతే భూ సమస్యలపై రైతులు వస్తారో వారి వద్దనుంచి ఫిర్యాదు తీసుకొని అక్కడే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత మండల తహసీల్దార్‌తో మాట్లాడుతారు. ఆ రైతు ఏ గ్రామానికి చెందిన వ్యక్తో ఆ వీఆర్‌ఏ, వీఆర్‌ఓ, సర్వేయర్‌ తదితర వారితో ముఖాముఖి మాట్లాడిస్తారు.పారదర్శకంగా భూ సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. ఇప్పటికే పార్ట్‌–ఏ లోని భూమికి సంబంధించి పాస్‌ పుస్తకాలు దాదాపు అందించాం. మిగిలినవి అందించేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. పార్ట్‌బీలోని పెండింగ్‌ ఖాతాల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రెవెన్యూ అధికారులు, సిబ్బందితో చర్చించి చర్యలు తీసుకుంటున్నారు.

No comments:

Post a Comment