Breaking News

12/11/2019

ఊసురు తీస్తున్న హార్వెస్ట్ మిషన్లు

ఖమ్మం, నవంబర్ 12, (way2newstv.in)
ఆయకట్టు, నాన్‌ఆయకట్టు ప్రాంతాలల్లో బోరుబావుల క్రింద సాగుచేసిన వరిఫైర్లు కోతలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడంతా హార్వెస్టర్ కాలం రావడంతో కూలీలకు స్వస్తి చెప్పి రైతులు యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వరి కోతలు గంటల్లో పూర్తవుతున్నాయి. రైతులు ఒక్క గింజ కూడా కింద పోయకుండా ధాన్యం నేరుగా మార్కెట్ కు తరలిస్తున్నారు. అయితే హార్వెస్టర్ వరి కోసే సమయంలో రైతులతో పాటు యజమానులు ఏ మాత్రం ఏమరపాటుగున్నా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.రైతులు తీసుకోవాల్సిన జాగత్త్రలుపూర్తిగా భూమి ఎండిన తరువాత వరి కోస్తే సమయం ఆదా అవుతుంది.
ఊసురు తీస్తున్న హార్వెస్ట్ మిషన్లు

ఒడ్డు, గట్టు చుట్టూ అరఫీటు దూరం వరికోయడంతో ఎకరానికి పదినిమిషాల సమయం కలిసి వస్తుంది.పచ్చిగా ఉన్న వరి కోయడం ద్వారా సమయం ఎక్కువ పడుతుంది. అదేవిధంగా వడ్లు కూడా గడ్డిలో పోయేప్రమాదం ఉంది.పొలంలో బురదగా ఉంటే పొలం కోయడంతో హార్వెస్టర్ దిగబడడం, రైతుకు సమయం వృధాతో పాటు ఖర్చు అధికమై నష్టం వాటిల్లుతుంది.ఒక మడి నుంచి మరొక మడికి వెళ్లేందుకు ముందుగా బాట తీస్తే హార్వెస్టర్ సులువుగా వెళ్లుతుంది. దీంతో సమయం ఆదాతో పాటు వడ్లు చెడిపోయే అవకాశం ఉండదు.వడ్లను పొలం మడిలో పోయవద్దు. ఒక వేళ వర్షం పడినా పై పొలం రైతులు నీళ్లు పెట్టినా ధాన్యం తడిసి మొలకెత్తే ప్రమాదం ఉంది.యజమానులూ హార్వెస్టర్‌ నడిపే డ్రైవర్, సహాయకుడిపై మొత్తం భారం వేసి ఉండకూడదు.కోతకు వచ్చిన పంట చేనుకు ముందుగా వెళ్లి అన్ని సదుపాయాలు చూసుకోవాలి.ముందుగా వరికోత పొలం చూడకపోతే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.కోత పొలంకు వెళ్లేటప్పుడు ఇరువైపుల దారి సక్రమంగా ఉందా లేదా చూసుకోవాలి. పక్క రైతుల నుంచి మాట రాకుండా చూసుకోవాలి.తప్పనిసరిగా హార్వెస్టర్ డ్రైవర్‌తో పాటు అతనికి తోడుగా మరొక సహాయకున్ని పంపించాలి.ముఖ్యంగా పొలంలో చేతికందే ఎత్తులో చాలా చోట్ల విద్యుత్ తీగలు ఉంటాయి. ముందుగానే గమనించి జాగ్రత్తలు పాటించాలి.విద్యుత్ స్తంబాలకు దూరం నుంచి హార్వెస్టర్ నడపాలి. లేకుంటే విద్యుత్ షార్ట్‌సర్కుట్ అయ్యే ప్రమాదం ఉంది

No comments:

Post a Comment