Breaking News

19/11/2019

గల్లిగల్లీకి డయాగ్నస్టిక్ సెంటర్లు..

అడ్డూ అదుపు లేకుండా ఫీజులు
ఖమ్మం, నవంబర్ 18, (way2newstv.in)
రాష్ర్టంలో డయాగ్నస్టిక్ సెంటర్ల తప్పుడు రిపోర్టులకు ఇవి కొన్ని ఉదాహరణలే. గల్లీగల్లీకొకటి వెలుస్తున్న సెంటర్లు రూల్స్ పాటించకుండా ఇష్టమొచ్చినట్టు రిపోర్టులిస్తున్నా హెల్త్ ఆఫీసర్లు కండ్లు తెరవడం లేదు. సెంటర్లకు అనుమతులివ్వడం వరకే పరిమితమవుతున్నారు. పర్యవేక్షణ గాలికొదిలేస్తున్నారు. అసలే డాక్టర్లు డయాగ్నస్టిక్స్‌‌పై ఆధారపడుతున్నరు. జ్వరమొచ్చి దవాఖానకు పోతే ఐదారు టెస్టులు రాస్తున్నరు. ఆ టెస్టుల్లో వచ్చే ఫలితాలపై ఆధారపడే ట్రీట్‌‌మెంట్ చేస్తున్నరు. ఇలాంటి పరిస్థితుల్లో రిపోర్టులో కాస్త తేడా వచ్చినా రోగి ప్రాణాలే పోయే ప్రమాదముంటుంది.ఒకప్పుడు డయాగ్నస్టిక్స్ సౌకర్యం హాస్పిటల్‌‌లోనే ఉండేది. ఇప్పుడు ప్రతి పట్టణంలో గల్లీగల్లీకీ సెంటర్లు పుట్టుకొచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో మండల స్థాయిలోనూ అందుబాటులో ఉన్నాయి.
గల్లిగల్లీకి డయాగ్నస్టిక్ సెంటర్లు..

వీటి ఏర్పాటు, పర్యవేక్షణకు ప్రత్యేక చట్టమేమీ లేదు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌‌‌‌‌‌‌‌మెంట్ యాక్ట్ కింద దవాఖాన్లకు పర్మిషన్ ఇచ్చినట్టే, వీటికీ జిల్లా మెడికల్ ఆఫీసర్లే అనుమతిస్తున్నారు.అంతటితో చేతులు దులుపుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో 3 నుంచి 4 వేల డయాగ్నస్టిక్‌‌‌‌‌‌‌‌ సెంటర్లు ఉంటాయని అధికారులంటున్నారు. కానీ ఏ జిల్లాలో ఎన్నున్నాయో పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో వివరాలు లేకపోవడం ఆశ్చర్యం. ఇప్పుడిప్పుడే ఈ వివరాలు సేకరిస్తున్నట్టు ఓ అధికారి వెల్లడించారు.డయాగ్నస్టిక్ సెంటర్‌‌‌‌‌‌‌‌ స్థాయి, చేస్తున్న టెస్టులను బట్టి పాథాలజిస్ట్‌‌‌‌‌‌‌‌, మైక్రోబయాలజిస్ట్‌‌‌‌‌‌‌‌, బయోకెమిస్ట్‌‌‌‌‌‌‌‌ తప్పనిసరిగా ఫలితాలను సర్టిఫై చేయాలి. ఈ నిబంధనను చాలా సెంటర్లు తుంగలో తొక్కుతున్నాయి. మెషీన్ ఇచ్చే ఆటోమెటిక్ ఫలితాలనే పాథాలజిస్ట్‌‌‌‌‌‌‌‌, మైక్రోబయాలిజిస్ట్, కెమిస్ట్‌‌‌‌‌‌‌‌ డిజిటల్‌‌‌‌‌‌‌‌ సైన్ ఉన్న పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రింట్ చేసి కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇస్తున్నారు. దీని వల్లే చాలా కేసుల్లో ఫాల్స్ పాజిటివ్ (లేనిది ఉన్నట్టు), ఫాల్స్ నెగటివ్‌‌‌‌‌‌‌‌(ఉన్నది లేనట్టు) రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌ వస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. మెడిసిన్‌‌‌‌‌‌‌‌కు ఉన్నట్టే డయాగ్నస్టిక్ మెషీన్లకూ ఎక్స్‌‌‌‌‌‌‌‌పైరీ టైం ఉంటుంది. టైం ముగిసిన మెషీన్లతో టెస్టులు చేస్తే రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌లో తేడాలొచ్చే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. ఇలాంటి కాలం చెల్లిన యంత్రాలు విదేశాల నుంచి ఎక్కువగా దిగుమవుతున్నాయని, వాటికే కొన్ని మార్పులు చేసి ఇక్కడ అమ్ముతున్నారని చెబుతున్నారు. మన దగ్గర చాలా డయాగ్నస్టిక్ సెంటర్లలోనూ ఇలాంటి సెకండ్ హ్యాండ్ మెషీన్లను వాడుతున్నారని డాక్టర్లు అంటున్నారు.దవాఖాన, డయాగ్నస్టిక్ సెంటర్ స్థాయిని బట్టి ఒకే టెస్టుకు రకరకాలుగా బిల్లులేస్తున్నారు. ఉదాహరణకు.. సీబీపీకైతే చిన్న సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.100 నుంచి రూ.150 మధ్య,  ప్రైవేటు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో రూ.350 వరకు, కార్పొరేట్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో రూ.600 వరకు వసూలు చేస్తున్నారు. ఒకే టెస్టుకు రకరకాల బిల్లులేయడానికి చాలా కారణాలుంటాయి. టెస్టులకు వాడే మెషీన్లు, కిట్లు, కెమికల్‌‌‌‌‌‌‌‌ నాణ్యతను బట్టి రేట్లుంటాయి. ఈమధ్య ప్రైవేటు హాస్పిటళ్లు ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసి డెంగీ నిర్ధారిస్తే హెల్త్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ఆ లెక్కను పరిగణనలోకి తీసుకోలేదు. ఆర్డీటీతో సరైన ఫలితాలు రావన్నారు.చిన్నాచితక డయాగ్నస్టిక్ సెంటర్లు తక్కువ ధరకు దొరికే కిట్లు, కెమికల్స్‌‌‌‌‌‌‌‌తో పరీక్షలు చేస్తాయని, వీటి వల్ల కూడా ఫలితాల్లో తేడాలు రావొచ్చని రేడియోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విస్డమ్‌‌‌‌‌‌‌‌ చౌదరి తెలిపారు. యంత్రం, టెస్టులు చేసే కిట్‌‌‌‌‌‌‌‌ను బట్టి బ్లడ్ శాంపిల్‌‌‌‌‌‌‌‌ సైజు తీసుకోవాల్సి ఉంటుంది. అనుభవం లేని, అన్‌‌‌‌‌‌‌‌క్వాలిఫైడ్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్ టెక్నీషియన్లు ఈ తేడాలు గుర్తించలేకపోతున్నారని చౌదరి వివరించారు. డయాగ్నస్టిక్ సెంటర్లపై పర్యవేక్షణకు కేంద్రం చట్టం తీసుకొచ్చే యోచనలో ఉందన్నారు.

No comments:

Post a Comment