Breaking News

28/11/2019

డిసెంబ‌ర్ 2న ఇంటెల్ సెంట‌ర్‌ ప్రారంభం: మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్‌ నవంబర్ 28 (way2newstv.in)
అమెరికా చిప్ కంపెనీ ఇంటెల్ సంస్థ హైద‌రాబాద్‌లో కొత్త కేంద్రాన్ని ప్రారంభించ‌నున్న‌ది. ఈ విష‌యాన్ని మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు. మాదాపూర్‌లో ఉన్న ఐటీ హ‌బ్‌లో ఇంటెల్ త‌న కొత్త డిజైన్ అండ్ ఇంజ‌నీరింగ్ సెంట‌ర్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. డిసెంబ‌ర్ 2వ తేదీన ఇంటెల్ సెంట‌ర్‌ను ప్రారంభిస్తారు. ఈ సెంట‌ర్‌తో హైద‌రాబాద్ ఆవిష్క‌ర‌ణ‌ల సంస్థ‌ల‌కు మ‌రింత ఊతం ఇవ్వ‌నున్న‌ది. 
డిసెంబ‌ర్ 2న ఇంటెల్ సెంట‌ర్‌ ప్రారంభం: మంత్రి కేటీఆర్

మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోట‌ల్ ప‌క్క‌న ఈ సెంట‌ర్‌ను మొద‌లుపెట్ట‌నున్నారు. సుమారు 1500 మంది దీంట్లో ప‌నిచేస్తారు. స‌లార్‌పురియా స‌త్వా నాలెడ్జ్ సెంట‌ర్‌లో 6 అంత‌స్తుల‌ను ఇంటెల్ సంస్థ త‌న డిజైన్ సెంట‌ర్ కోసం తీసుకున్న‌ది. గత ఆగ‌స్టులోనే హైద‌రాబాద్‌లో అమెజాన్ త‌న సంస్థ‌ను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. చైనాకు చెందిన సంస్థ వ‌న్ ప్ల‌స్ కూడా త్వ‌ర‌లో భారీ సెంట‌ర్‌ను స్టార్ట్ చేయ‌నున్న‌ది.

No comments:

Post a Comment