Breaking News

18/10/2019

బోటు గుర్తింపు…వెలికితీత పనులు ముమ్మరం

కాకినాడ అక్టోబరు 18, (way2newstv.in)

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు సమీపాన గోదావరి నదిలో మునిగిన బోటు ఆచూకీ లభ్యమైంది.  బోటును వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాల్లోబోటు రైలింగ్  యాంకర్కు చిక్కింది.  బోటు ఇనుప రెయిలింగ్ను ధర్మాడి సత్యం బృందం ఒడ్డుకు తీసుకువచ్చింది.  అయితే బోటు ఒడ్డుకు చేరేందుకు మరో రెండ్రోజులు పడుతుందని బృంద సభ్యులు తెలిపారు.  బోటులో 13 మృతదేహాలున్నట్లుగుర్తించామని  అధికారులు అంటున్నారు.
బోటు గుర్తింపు…వెలికితీత పనులు ముమ్మరం


రెయిలింగ్ బయటకు రావడంతో..ఇక బోటు బయటకు వస్తుందనే ఆశలు చిగురించాయి. కొన్ని రోజులుగా బోటు వెలికితీత పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలు పడుతుండడం..ఇతరత్రా కారణాలతో వెలికితీత పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. రెయిలింగ్ మాత్రమే వచ్చిందని, అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం ఆపరేషన్ కొనసాగిస్తామని ధర్మాడి వెల్లడించారు.బోటు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన ధర్మాడి బృందం... దాని చుట్టూ రోప్లు వేసి ఉంచింది. గజ ఈతగాళ్లతో సంప్రదింపులు జరుపుతూ సంప్రదాయ పద్దతిలో పనులు కొనసాగిస్తోంది ధర్మాడి బృందం. బోటును లంగరు ద్వారా కదలించి  ఉచ్చులో బిగించేలా చేశారు. వీరికి సహాయంగా కాకినాడ నుంచి మరోక టెక్నికల్ టీమ్ కూడా కచ్చులూరు వద్ద రంగంలోకి దిగింది.  

No comments:

Post a Comment