నల్గొండ, అక్టోబరు 11, (way2newstv.in)
హుజూర్‌నగర్ ఉపఎన్నిక టీఆర్‌ఎస్‌లో గుబులురేపుతోంది. పార్టీ నివేదికలు, సర్వేల్లో టీఆర్‌ఎస్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనంగా లేదని తేలడంతో అధిష్టానం ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. హుజూర్‌నగర్‌లో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారట. అయితే, కేసీఆర్ రంగంలోకి దిగితేనే గెలుపు అవకాశాలు ఉంటాయని పార్టీ లీడర్లు చెబుతున్నారు.హుజూర్‌నగర్‌లో ఎలాగైనా గులాబీ జెండా పాతాలన్న కృతనిశ్చయమంతో ముందుకెళ్తోన్న టీఆర్‌ఎస్‌కు స్థానిక సమీకరణాలు, పరిస్థితులు అంత అనుకూలంగా లేవనే మాట వినిపిస్తోంది.
హూజూర్ నగర్ లో గులాబీకి టెన్షన్
ఇప్పటికే గ్రౌండ్ రిపోర్ట్‌ను తెప్పించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయిలో మరింత ఫోకస్ పెట్టాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారట.దాదాపు పది రోజులుగా టీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జులంతా హుజూర్‌నగర్‌లో మకాంవేసి, మండలాల వారీగా ప్రచారం నిర్వహిస్తూ, పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు హైకమాండ్‌కు రిపోర్టులు పంపిస్తున్నారు. అయితే, పార్టీ నేతలు నివేదికలు పంపిస్తున్నా, కేసీఆర్ మాత్రం ప్రైవేట్ సర్వేలు చేయించుకుంటూ, రోజువారీ రిపోర్టుల ఆధారంగా టీఆర్ఎస్ బలాన్ని అంచనా చేస్తున్నారు. అయితే, సర్వే రిపోర్టులు గులాబీ బాస్‌ను కలవరం పెట్టిస్తున్నాయట. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా టీఆర్‌ఎస్‌కు మైనస్‌గా ఉన్నట్లు తేలిందట. దాంతో కాంగ్రెస్ కంచుకోటలను బద్దలుకొట్టడానికి కేసీఆర్ కొత్త వ్యూహాలను రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ముఖ్యంగా టీఆర్‌ఎస్ అభ్య,ర్ధి సైదిరెడ్డిపై సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత ఉండటం హైకమాండ్‌కి తలనొప్పిగా మారిందంటున్నారు. కేసీఆర్‌తో రెండు మూడు సభలు నిర్వహిస్తేనే పరిస్థితి ఏమైనా మారొచ్చని, లేదంటే గడ్డు పరిస్థితేనని హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ లీడర్లు అంటున్నారు
No comments:
Post a Comment