Breaking News

21/10/2019

అమరవీరుల స్పూర్తితో…

నారాయణపేట అక్టోబరు 21, (way2newstv.in)
నారాయణపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్. చేతన అమర వీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో శాంతి స్థాపనకు సంఘ విద్రోహులతో పోరాడుతు ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమర వీరులను స్మరించుకుంటు వారి త్యాగం ఎప్పుడు వృధా కాదన్నారు.
అమరవీరుల స్పూర్తితో…

వారిచ్చిన స్పూర్తితో ముందుకు కొనసాగుతామన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులను సన్మానించి జ్ఞాపిలను అందచేశారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న పోలీసులకు ప్రశంస పాత్రలు అందచేశారు.అనంతరం ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు,పాఠశాల విద్యార్థులు జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఆడి షనల్ ఎస్పీ సి.ఎచ్.కుమార స్వామి డీఎస్పీ శ్రీధర్ తో పాటు జిల్లాలోని సి.ఐలు,ఎస్సైలు మరియు పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

No comments:

Post a Comment