Breaking News

18/10/2019

క్రమబద్దీకరణ దిశగా సంక్షేమ హాస్టళ్లు

హైద్రాబాద్, అక్టోబరు 18, (way2newstv.in)
సంక్షేమ వసతి గృహాలను హేతుబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న వాటిని సమీప హాస్టళ్లలో విలీనం చేయాలని భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,850 వసతి గృహాలున్నాయి. వీటిలో వెయ్యికిపైగా ప్రీ మెట్రిక్‌ హాస్టళ్లున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత విడతల వారీగా గురుకుల పాఠశాలలను అందుబాటులోకి తేవడంతో వసతి గృహాల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈక్రమంలో పిల్లల సంఖ్య అధారంగా హేతుబద్ధీకరిస్తే.. మరింత మెరుగైన సేవలు అందించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సమరి్పంచాలని సంక్షేమ శాఖాధిపతులను ఆదేశించింది. 
క్రమబద్దీకరణ దిశగా సంక్షేమ హాస్టళ్లు

ప్రభుత్వ సంక్షేమ వసతిగృహంలో కనీసం వంద మంది పిల్లలుండాలని ప్రభుత్వం భావిస్తోంది. చాలాచోట్ల ప్రీమె ట్రిక్‌ హాస్టళ్లలో పిల్లల సంఖ్య తక్కువగా ఉంది. కొన్ని చోట్ల 30 నుంచి 50 మంది వరకే ఉండటంతో నిర్వహణ భారమవుతోంది. ఈ నేపథ్యంలో 50 కంటే తక్కువ మంది విద్యార్థులున్న హాస్టళ్లను మూసేయాలని.. అక్కడున్న విద్యార్థులను సమీప హాస్టళ్లలో విలీనం చేయాలని ప్రాథమికంగా తేల్చారు. ఈ దిశగా హాస్టళ్ల వారీగా విద్యార్థుల వివరాలు.. తక్కువున్న హాస్టళ్లకు సమీపంలో ఉన్న వసతిగృహాలు.. ఇలా నిర్దేశించిన కేటగిరీలో సమాచారాన్ని సమర్పించాలని సంక్షేమ శాఖాధిపతులను ఆదేశించింది. ఈ క్రమంలో అధి కారులు వివరాల సేకరణకు ఉపక్రమించారు. ఈ నెలాఖరు లోగా పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  సంక్షేమ వసతిగృహాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. విద్యార్థులకు మెస్‌చార్జీలు, ఇతరత్రా సౌకర్యాలు, అధికారుల జీతభత్యాలకు ఖర్చు పెడుతోంది. అయితే ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య పెంచుకోవడానికి ఇటు హాస్టల్‌ వార్డెన్‌లు, అధికారులు ఎక్కడా తమవంతు ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. విద్యార్థులకు అవగాహన కల్పించి తల్లిదండ్రులను ఒప్పించి హాస్టళ్లలో చేర్పించడంలో ఆయా సంక్షేమశాఖల అధికారులు విఫలమయ్యారని చెప్పవచ్చు. ప్రభుత్వ నిబంధనలతో విద్యార్థుల తల్లిదండ్రులు బేజారవుతున్నారు. 5 కిలో మీటర్ల దూరంలో ఉండే వారికి మాత్రమే హాస్టల్‌ ప్రవేశం కల్పిస్తున్నారు. ఉదాహరణకు తగరకుంటలో ఉన్న హాస్టల్‌లో ఆ గ్రామానికి చెందిన విద్యార్థులు చేరడానికి ఆసక్తిగా ఉన్నా ఈ 5 కిలో మీటర్ల దూరం నిబంధన అడ్డుపడుతోంది. దీంతో హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఇలాంటి హాస్టళ్ళు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నాయి. సంవత్సరానికి విద్యార్థులకు నాలుగు జతల యునిఫాం, ట్రంకుపెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, నోట్‌పుస్తకాలు, కాస్మోటిక్‌ చార్జీల నిధులు విద్యార్థులకు చెల్లించడంలో కూడా అంతంతమాత్రంగానే అమలు చేస్తున్నారు. మరోవైపు సగానికి పైగా హాస్టళ్లకు ఇన్‌చార్జి వార్డెన్లు ఉండడం కూడా సమస్యల పరిష్కారం కాకపోవడానికి కారణంగా తెలుస్తోంది.

No comments:

Post a Comment