Breaking News

18/10/2019

2030 మాస్టర్ ప్లాన్ దిశగా హెచ్ఎండీఏ అడుగులు

హైద్రాబాద్, అక్టోబరు 18, (way2newstv.in)
హెచ్‌ఎండిఏ కొత్తగా రూపొందించే 2031 మాస్టర్‌ప్లాన్ కోసం రియల్టర్లు ఎదురు చూస్తున్నారు. గతంలో రూపొందించిన 2013 మాస్టర్‌ప్లాన్‌లో పలు మార్పులు చేసి ప్రస్తుత రియల్‌ఎస్టేట్ బిజినెస్‌కు అనుగుణంగా 2031ను హెచ్‌ఎండిఏ తయారు చేస్తుంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండిఏ పరిధిలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో రియల్ ఎస్టేట్‌కు మహర్దశ పట్టే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. కొత్త మాస్టర్‌ప్లాన్ అమల్లోకి వస్తే హెచ్‌ఎండిఏ పరిధిలో రియల్ ఎస్టేట్ మరింత అభివృద్ధి చెందుతుందని భావించిన రియల్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. 
2030  మాస్టర్ ప్లాన్ దిశగా హెచ్ఎండీఏ అడుగులు

దీనికోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. 2013లో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌తో శివారు మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీల్లో రియల్ ఎస్టేట్ కళకళలాడింది. కొనుగోలుదారులు సైతం హెచ్‌ఎండిఏ లే ఔట్ల వైపే మొగ్గు చూపారు.ప్రస్తుతం హెచ్‌ఎండిఏ రూపొందిస్తున్న 2031 మాస్టర్‌ప్లాన్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొనడంతో ముందస్తుగా రియల్టర్లు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. 2013 సంవత్సరం తరువాత హెచ్‌ఎండిఏ పరిధి మరింత విస్తరించింది. సంవత్సరం క్రితం టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 66 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. అయితే హెచ్‌ఎండిఏ పరిధిలో మున్సిపాలిటీలు ఎక్కువగా ఉండడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా జరుగుతుండడంతో హెచ్‌ఎండిఏ కొత్త మాస్టర్‌ప్లాన్ రూపొందించడానికి నిర్ణయించింది. అయితే ఈ కొత్త మాస్టర్‌ప్లాన్‌లో ఏయే ప్రాంతాలు ఏయే జోన్‌లోకి వస్తాయో తెలియక రియల్టర్లు కొంతమేర గందరగోళానికి గురవుతున్నా దాని గురించి తెలుసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది.ఓఆర్‌ఆర్ లోపలున్న నగరం, ఓఆర్‌ఆర్ అవతల ఉన్న రీజనల్ రింగ్‌రోడ్డు వరకు ఉండే నగరం, ఆర్‌ఆర్‌ఆర్ అవతల మరో 5 కిలోమీటర్ల వరకు విస్తరించిన నగరం. ఇలా నగరాన్ని విభజించుకొని సౌకల సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే కొత్త మాస్టర్ ప్లాన్‌ను రూపొందించుకోవాలని ప్రభుత్వం గతంలో పేర్కొంది. కొత్త మాస్టర్ ప్లాన్‌లో సంబంధిత ప్రాంతాలను చేర్చితే అమాంతం భూముల రేట్లు పెరిగే అవకాశం ఉన్నందున ముందుస్తుగానే రియల్టర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇప్పటికే కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో అక్రమ లే ఔట్లపై హెచ్‌ఎండిఏతో పాటు మున్సిపల్ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. కొనుగోలుదారులు సైతం కొత్తగా హెచ్‌ఎండిఏ రూపొందించే మాస్టర్‌ప్లాన్ 2031 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హెచ్‌ఎండిఏ పరిధిలోని వివిధ మాస్టర్‌ప్లాన్‌లను కలిపి ఇంటిగ్రేటెడ్ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని గతంలో సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా) హైదరాబాద్ విమానా శ్రయాభివృ ద్ధి సంస్థ (హడా) సైబరాబాద్ అభివృద్ధి సంస్థ (సిడిఏ), మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసిహెచ్), హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ)లు కలిసి ఇంటిగ్రేటెడ్ మాస్టర్‌ప్లాన్ తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. అందులో భాగంగానే మాయమైన చెరువులు, కుంటలు, పంచాయతీలు, లేని సర్వే నెంబర్ల తదితర వాటిని ఇంటిగ్రేటెడ్‌లో చేర్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే రెసిడెన్షియన్ జోన్లను, మల్టీపర్సస్, కన్వర్జెన్సీ, కమర్షియల్ జోన్లుగా విభజించి మాస్టర్‌ప్లాన్ రూపొందించడానికి హెచ్‌ఎండిఏ కసరత్తు చేస్తుండడంతో రియల్టర్లు కొత్త మాస్టర్‌ప్లాన్‌పై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

No comments:

Post a Comment