కరీంనగర్, సెప్టెంబర్ 13 (way2newstv.in):
రెండేళ్లుగా ఆధునిక యంత్ర సాయం లేక రైతులు నిధుల కోసం ఎదురుచూస్తుండగా యాసంగికైనా రైతుల ఆశ తీరుతుందో లేదో అనుమానమే.. 2017వరకు ఏటా ఖరీఫ్‌లో రైతులకు రాయితీ పరికరాలను అందించగా రెండేళ్లుగా నేటికీ అతీగతిలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్దపీట వేస్తున్నప్రభుత్వం యాంత్రీకరణను నిర్లక్ష్యం చేయడం శాపంగా మారింది. కూలి ఖర్చులతో పాటు సమయాన్ని ఆదా చేసుకోవాలని రైతులు ఎక్కువగా యంత్రాలపై ఆధారపడుతుండగా రాయితీ పరికరాలకోసం పడిగాపులు తప్పడం లేదు. యంత్రాల కోసం దరఖాస్తు చేయడం.. పడిగాపులు కాయడం రివాజుగా మారింది. ప్రతి మార్చి నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరం కాగా సదరు గడువులోగాకేటాయించిన నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కరుణించని పరికరం (కరీంనగర్)
రిజర్వేషన్ వారీగా ట్రాక్టర్లు, యంత్రాలను మండలాలకు కేటాయించడం తదుపరి మీసేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించడం అనంతరం జిల్లా కమిటీద్వారా అమోదం తెలిపి పాలనాధికారి అనుమతితో రైతులకు ట్రాక్టర్లను అందజేయాల్సి ఉంటుంది. 2014, 2015 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులను మంజూరు చేయగా 2016 నుంచి మాత్రంకేటాయింపులు ఒకరకంగా మంజూరు మరోరకంగా ఉంటోంది. 2016లో రూ.36 కోట్లు కేటాయించగా కేవలం రూ.9.69 కోట్లు మాత్రమే విడుదల చేయగా 2017 సంవత్సరంలో రూ.8.94 కోట్లుకేటాయించగా అందులో సగానికి పైగా నిధులు నేటికీ విడుదల కాకపోవడం గమనార్హం.. నాలుగు విడతలుగా మూడు నెలలకోసారి నిధులు విడుదల కావాల్సి ఉండగా తొలి, రెండో నిధులు మంజూరుకాకపోగా ప్రస్తుతం మూడో విడత నిధులు రావాల్సి ఉంది.వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో ఎస్సీ, ఎస్టీలకు రాయితీని గరిష్ఠంగా రూ.5 లక్షలుగా నిర్ణయించారు. ఇతర వర్గాలకు రూ.4 లక్షలు రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో మాదిరిగానే రూ.2లక్షల్లోపు విలువైన యంత్రాలకు ఏడీఏ పరిధిలో, రూ.2లక్షలు దాటితే జిల్లా కమిటీ పరిధిలో లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. మొత్తంగా 50 శాతం రాయితీతో ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు,తదితర పరికరాలు అందజేయనున్నారు. మాన్యువల్ దరఖాస్తులతో అక్రమాలు చోటుచేసుకోవడంతో 2016 నుంచి మీ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే.. సదరువిధానంలో దరఖాస్తులను స్వీకరించాల్సి ఉండగా నిధులు రాక రైతులు బహిరంగ విపణిలో ట్రాక్టర్లు, పరికరాలను కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రైతు రూ.3 లక్షల వరకునష్టపోవాల్సి వస్తోంది. రాయితీ పథకం అమలైతే కోట్ల వ్యయం తప్పనుంది. మార్చి నుంచి మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా ఉండేది.. ఇకపై జనవరి నుంచి జనవరి ఆర్థిక సంవత్సరంగాపరిగణించాలని కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలో అంగ్ల సంవత్సరాది ప్రకారం నిధులను ఖర్చు చేయాలంటే మరో నాలుగు నెలల సమయమే ఉంది. ఈ లోపు శాసనసభ బడ్జెట్ సమావేశాలవడం,నిధులు కేటాయించడం జరిగితేనే రైతులకు ప్రయోజనం లేకుంటే మళ్లీ నిరీక్షణే.. కేటాయించిన నిధులను మంజూరు చేసి డివిజన్లవారీగా అలాట్‌మెంట్ చేయడం, మండలం వారీగా నిధులనుకేటాయించడం ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి యుద్ధ ప్రాతిపదికన దరఖాస్తులను స్వీకరిస్తేనే సరి.. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా వచ్చిన నిధులు వెనక్కి వెళ్లే అవకాశాలు పుష్కలం..నిధులను మంజూరు చేస్తేనే రైతన్నకు సాంత్వన..వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగమైన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన నాలుగేళ్లుగా అటకెక్కింది. 2016లో తొలి విడత మాత్రమే నిధులు కేటాయించగా తదుపరి కార్యాచరణ కరవైంది. ఈపథకం ద్వారా రైతులకు పరికరాలు, అద్దె ప్రాతిపదికన యంత్రాలను ఇవ్వడం పరిపాటి.. పథకానికి రూ.5కోట్ల వరకు కేటాయించేవారు. ఈ సారి ఆ ఊసే లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అయితే నిధులు రాలేదని.. నిధులు మంజూరయ్యాక దరఖాస్తుల ప్రక్రియ చేపట్టి రాయితీ ట్రాక్టర్లు, పరికరాలను అందజేస్తామని అధికారులు చెప్తున్నారు.
No comments:
Post a Comment