Breaking News

27/09/2019

విద్యారంగంలో తెలంగాణ ర్యాంక్ 14

హైద్రాబాద్, సెప్టెంబర్ 27 (way2newstv.in)
పాఠశాల విద్య విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ విషయంలో టాప్-5లో కేరళ మొదటి స్థానంలో ఉండగా.. ఉత్తర్ ప్రదేశ్ చివరి స్థానంలో నిలిచింది. కేరళ తర్వాత రాజస్థాన్ (2), కర్ణాటక (3), ఆంధ్రప్రదేశ్ (4), గుజరాత్ (5) రాష్ట్రాలు టాప్-5లో నిలిచాయి. 
విద్యారంగంలో తెలంగాణ ర్యాంక్ 14

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4వ స్థానంలో నిలవగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం 14వ స్థానానికి పరిమితమైంది.దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యాప్రమాణాలను పరిశీలించిన నీతి ఆయోగ్.. 30 రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని 2016-17 గణాంకాల ప్రకారం ఈ ర్యాంకులను కేటాయించింది. ఈ ర్యాంకు వివరాలను నీతిఆయోగ్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.ఈ జాబితా నుంచి వెస్ట్ బెంగాల్‌ను మినహాయించారు. ఇక మణిపూర్, త్రిపుర, మిజోరం, సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, అరుణాలచల్ ప్రదేశ్, గోవాలను చిన్న రాష్ట్రాలుగా పరిగణనలోకి తీసుకున్నారు

No comments:

Post a Comment