Breaking News

21/08/2019

గ్రామంలో ఒకే వినాయకచవితి

మెదక్, ఆగస్టు 21 (way2newstv.in - Swamy Naidu
స్థానికులంతా ఒకచోట కలిసి మెలిసి వేడుక చేసుకునేందుకు వచ్చినవే వినాయక చవితి వంటిపలు పండుగలు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. వీధికి నాలుగైదు వినాయక మూర్తులు వెలుస్తున్నారు. ఆ ప్రతిమలు ఎత్తులో కూడా పోటీ. అటువంటప్పుడు దాంట్లో కమ్యూనిటీ ఎక్కడుంటుంది? అందుకే ప్రజలందరూ ఎటువంటి తరతమ బేధాలు లేకుండా ఒకే చోట కలిసి మెలిసి వినాయకుడి పండుగ జరుపుకోవాలని టీఆర్ ఎస్ నేత హరీశ్ రావు ఆకాంక్షించారు.దాని కోసం పిలుపునిచ్చారు. అదీకూడా పర్యావరణహితంగా పండుగ జరుపుకోవాలని కోరుతూ గ్రామస్థులకు పిలుపునిచ్చారు. ఆయన పిలుపును మిట్టపల్లి గ్రామవాసులు  స్పందించారు. హర్షం వ్యక్తంచేశారు. 
గ్రామంలో ఒకే వినాయకచవితి
మిట్టపల్లితో పాటు మరో కొన్ని గ్రామాలు కూడా స్పందించాయి. మేము కూడా మీ బాటలోనే నడుస్తామన్నాయి.  గ్రామంలోని యువత, మహిళలు, రైతులు, ప్రజాప్రతినిధులు సహా అన్ని వర్గాలూ హరీష్ రావు నిర్ణయానికి ఓకే అన్నాయి. భక్తజన సంఘాలూ కూడా ఓకే అన్నాయి. ఇంకేముంది మిట్టపల్లి స్ఫూర్తిగా మరో ఐదు గ్రామాలు అదే బాటలో నడుస్తామంటు ముందుకొచ్చాయి.సిద్దిపేట రూరల్ మండలం రాంపూర్, మాచపూర్ బండ చెర్లపల్లి, నారాయణరావుపేట మండలం కోదండరావుపల్లి గ్రామాల ప్రజలు మా ఊరిలో ఒక్కడే వినాయకుడిని పెట్టుకుంటాం అదీ మట్టి వినాయకుడినే పూజించుకుంటాం' అంటూ తీర్మానాలు చేసుకున్నారు. వాటి ప్రతులను హరీష్‌రావు అందించారు. ఈ క్రమంలో తన పిలుపునకు వెంటనే స్పందించి సమాజం పట్ల తమ భాధ్యతను తెలియజేసిన మిట్టపల్లి గ్రామానికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని హరీష్‌రావు ప్రకటించారు.

No comments:

Post a Comment