Breaking News

22/08/2019

800ల ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం

జయశంకర్ భూపాలపల్లి,ఆగస్టు 22, (way2newstv.in)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయం ఉంది. కాకతీయుల కాలంలో వారి సేనాని రేచర్ల రుద్రయ్య 1213లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది నిర్మించి 800ల ఏండ్లు పూర్తికాగా నేటికీ శిల్పాల అందాలు కనువిందు చేస్తున్నాయి. నక్షత్రాకారపు పీఠంపై ప్రధానాలయం నిర్మించారు. దీనికోసం భారీరాళ్లను ఉపయోగించారు. ప్రధానాలయంలోని శివలింగం, నాలుగు భారీ స్తంభాలు, గర్భగుడి ప్రవేశద్వారం, ఆలయం చుట్టూ కనిపించే 12 అందమైన స్త్రీల విగ్రహాలు, 28 ఏనుగు, సింహం విగ్రహాలు, అందంగా కనిపించే భారీ నంది విగ్రహం నల్లసేనపు రాయితో చేశారు. ఈరాళ్లను ఎక్కడ నుంచి తెచ్చారో స్పష్టత లేదు. 
800ల ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం 

రామప్పను ఆనుకుని ఉన్న కాటేశ్వర, కామేశ్వరాలయంతో పాటు పాలంపేట పరిధిలో 20 వరకు చిన్న ఆలయాలు కనిపిస్తాయి. రామప్ప సరస్సు నిర్మాణం వానగుట్ట, వరాలగుట్టల మధ్యలో వేసిన ఆనకట్టతో సాధ్యమైంది. వరాలగుట్టపై భాగంలో చుట్టూ రాళ్లతో పేర్చిన 6 అడుగుల కోటగోడ సుమారు 20 ఎకరాల స్థలంలో కనిపిస్తుంది. వానగుట్ట కింద నుంచి పైవరకు భారీ రాళ్లను తరలించే ముందు పగుళ్లకు గురికాకుండా ఉండేందుకు చిన్న చిన్న రంధ్రాలను చేసి కావలసిన విధంగా కొలతలతో సిద్ధం చేసిన ఆనవాళ్లు నేటికీ చెక్కుచెదరకుండా కనిపిస్తున్నాయిఇవన్నీ నిర్మించేందుకు ఇక్కడి గుట్టలపై ఉన్న రాళ్లనే వాడినట్లు తెలుస్తోంది.ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో.. ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో.. అంటూ వర్ణించాడో సినీకవి. అద్భుత శిల్పసంపదతో ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకున్న రామప్ప దేవాలయాన్ని చూసిన తర్వాత తనమదిలో కలిగిన అనుభూతులకు అక్షరూపమిచ్చిన ఆ కవి మాటలు అక్షరసత్యాలని ఇక్కడి శిల్పాలను చూస్తే తెలుస్తుంది. తెలుగుజాతిని ఏకంచేసి జనరంజకంగా పరిపాలించిన కాకతీయరాజుల కాలంనాటి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను చెప్పే ఆనవాళ్లలో ప్రధానమైనవి ఆలయాలే. ప్రపంచంలోనే శిల్పిపేరుతో ఉన్న ఏకైక ఆలయంగా రామప్ప. ఈ ఆలయం ప్రాచీన కాలంనాటి విశేషాలకు నిలువెత్తు నిదర్శనం. ఇక్కడి శిల్పాలకోసం ఎక్కడి రాళ్లను వినియోగించారు, యంత్రాలు లేనికాలంలో భారీగా ఉన్న బండలను ఎలా తరలించగలిగారు అనే విషయాలు ఆసక్తికరమే. గతేడాది రామప్ప తూర్పు వైపున ఉన్న ప్రాకారం కూలిపోగా పునర్నిర్మాణం కోసం కొన్ని భారీ రాళ్లు కావాల్సి వచ్చింది. పురావస్తు శాఖాధికారులు సమీపంలోని గుట్టలను పరిశీలించగా, ప్రాచీన కాలంలో అప్పుడు తొలిచిన ఆనవాళ్లను, రామప్ప చెక్కిన రాళ్లను గుర్తించారు. కూలిన ప్రాకారం(గోడ), శిథిలమైన ఆలయాల పునరుద్ధరణకు ఈరాళ్లనే వినియోగించేందుకు సిద్ధమవుతున్నారు..ఇటీవల ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు కందకాలు తీస్తున్న సమయంలోనూ కొన్ని వదిలేసిన రాళ్లు బయటపడ్డాయి. గుట్టపై చాలా భాగంలో ఇవి ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల సహాయం లేకుండా అంత ఎత్తైన ప్రాంతం నుంచి భారీ రాళ్లను కిందకు దింపడంతో పాటు వాటిని ఆలయాలు నిర్మించే ప్రాంతాలకు తరలించిన విధానం నిజంగా అద్భుతమే

No comments:

Post a Comment