అనంతపురం, జూలై 25, (way2newstv.in)
పీఏసీ. ఇటు ప్రభుత్వానికి చురకలు అంటిస్తూ.. అటు ప్రతిపక్షానికి పదునైన అస్త్రాలు అందించే ప్రజా పద్దుల కమిటీ. ప్రభుత్వం చేసే ప్రతి రూపాయి ఖర్చును ఈ కమిటీ భూతద్దంలో పరిశీలిస్తుంది. పార్లమెంటరీ వ్యవహారాల నిబంధనల కింద ఈ పదవికి ప్రతిపక్షానికి కేటాయిస్తారు. దీనిలో ఐదుగురు కీలక సభ్యులు ఉంటారు. ఇద్దరు అధికార పక్షం నుంచి, ఇద్దరు ప్రతిపక్షం నుంచి ఒకరు చైర్మన్‌గా ఈ పదవులు అందుకుంటున్నారు. అత్యంత కీలకమైన ఈ పీఏసీకి రాజ్యాంగమే అనేక వెసులుబాట్లు కల్పించింది. ప్రభుత్వం సమర్పించే ప్రతి పద్దును ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి లోపాలను ఎత్తి చూపుతుంది.సవరించుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తుంది.
పయ్యావుల ప్లానేంటీ...
అయితే, ఆయా సూచనలను ప్రభుత్వం పాటిస్తుందా? లేక పక్కకు పెడుతుందా? అనేది సీఎం విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. ఇక, ఈ పీఏసీ చైర్మన్‌గా ఉండే నాయకుడు ఖచ్చితంగా ప్రతిపక్షంలో గెలిచిన ఎమ్మెల్యే అయి ఉండాలనేది నిబంధన. ఈ పదవికి కేబినెట్ ర్యాంక్ హోదా ఉంటుంది. తరచుగా భేటీ అయి.. ప్రభుత్వ నిర్ణయాలను, ఖర్చులను కూడా సమీక్షించే అధికారం ఉంది. ఇప్పుడు తాజాగా జగన్ ప్రభుత్వం కూడా పీఏసీని ఏర్పాటు చేసింది. దీనికి ప్రతిపక్ష్ం టీడీపీ నుంచి సీనియర్ నాయకుడు, వివాద రహితుడు అయిన పయ్యావుల కేశవ్‌ను చైర్మన్‌గా చంద్రబాబు నామినేట్ చేశారు.పీఏసీ ఛైర్మన్‌గా బలమైన వాయిస్ ఉన్నవారికి ఇవ్వాలని చంద్రబాబు భావించారు. అందులో భాగంగా కాపు లేదా బీసీ వర్గాలకు చెందిన వారికి ఇవ్వాలని భావించినా..ఇప్పటికే బీసీ..కాపు వర్గాల నుండి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఉండటంతో…అంశాల వారీగా అవగాహన ఉన్న కేశవ్‌ను ఎంపిక చేసారు. కాగా అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ నాలుగోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ కేశవ్ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుంది. నిజానికి అసెంబ్లీ తరఫున అనేక కమిటీలు ఉన్నప్పటికీ.. ప్రజాపద్దుల కమిటీ ప్రభుత్వానికి , ప్రతిపక్షానికి కూడా గుండెకాయ వంటిది. గతంలో ఈ పదవిని చేపట్టిన భూమా నాగిరెడ్డి.. తర్వాత కాలంలో టీడీపీలో చేరిపోయారు.దీంతో వైసీపీ నాయకుడు జ్యోతుల నెహ్రూకు జగన్ అప్పగించినా ఆయన కూడా టీడీపీలో చేరిపోయారు. తర్వాత డోన్ నుంచి గెలిచిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి జగన్ ఈ పదవిని అప్పగించారు. ఇప్పుడు ఈయనే ఆర్థిక శాఖ మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. అంటే.. ప్రభుత్వ పద్దులపై పూర్తి అవగాహనతోపాటు.. దేనికి ఎంత కేటాయించాలనే విషయంపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. అదేసమయంలో ఎక్కడ ఎక్కువ ఖర్చు చేశారు? ప‌్రజలు ఏం కోరుతున్నారో కూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది. దీనిని బట్టి ప్రజల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తుంది. మొత్తానికి కొంత ఆలస్యమే అయినా.. పయ్యావులకు మంచి పదవే దక్కిందని అంటున్నారుతమ్ముళ్లు. మరి గత కొంతకాలంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం పయ్యావుల కూడా ఈ పదవిలో ఉంటారా? లేక జంప్ చేస్తారా? అన్న చర్చ జరుగుతోంది
No comments:
Post a Comment