Breaking News

27/07/2019

చంద్రుడిపై నీటి జాడలా... మంచుకొండలా

నెల్లూరు, జూలై 27, (way2newstv.in)
మనకు కనిపించే చంద్రుడికి మరోవైపు ఉన్న దక్షిణ ధృవంలో ఏముంది? అక్కడ మంచు కొండలు ఉన్నాయా? నీటి జాడలు కనిపిస్తాయా? కేవలం గోతులతో నిండి ఉంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం కేవలం భారత్‌లోనేగాక ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సామాన్యుల నుంచి శాస్తవ్రేత్తల వరకూ ప్రతి ఒక్కరూ ఈనెల 22న భారత్ ప్రయోగించిన చంద్రయాన్-2 ఫలితాలపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీహరి కోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నుంచి ప్రయోగించిన అత్యంత శక్తివంతమైన జీఎస్‌ఎల్‌వీ-ఎంకే3-ఎం1 రాకెట్ తన 48 రోజుల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది. ఇంత వరకూ ఎవరూ పరిశోధించని చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో రోవర్ పరిశోధనలు చేస్తుంది. 
చంద్రుడిపై నీటి జాడలా... మంచుకొండలా

ఛాయా చిత్రాలను తీస్తుంది. అంతేగాక, సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో నీటి ఆనవాళ్లు, ఇతర కీలక అంశాలను పరిశీలిస్తుంది. సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్రోకు పంపుతుంది. చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో నీటి జాడలు ఉన్నాయన్న వాదన బలంగా వినిపిస్తున్నప్పటికీ, ఇంత వరకూ ఎవరూ దానిని నిర్ధారించలేకపోయారు. చంద్రయాన్-2 ఈ ప్రశ్నలకు సమాధానలను అనే్వషిస్తుంది. చంద్రుని దక్షిణ ధృవంలో పరిశోధనలు జరుపుతుంది. ఎన్నో కీలక విషయాలను నిగ్గుతేల్చనుంది.మనకు కనిపించని చంద్రునిలోని రెండో భాగంలో అత్యంత చల్లని వాతావరణం ఉంటుందని పరిశోధకుల అంచనా. అదే విధంగా నీటి జాడలు కనిపిస్తాయని కూడా అనుకుంటున్నారు. అయితే, అక్కడ కేవలం గుంటలు, లోయలు తప్ప చెప్పుకోదగ్గ విశేషాలు ఏవీ ఉండవన్న వాదన కూడా బలంగా వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో భారత్ చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం అందరినీ ఆకర్షిస్తున్నది. అక్కడి నుంచి వచ్చే సమాచారం కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. మొత్తం మీద చంద్రయాన్-2 జాబిల్లి దక్షిణ ధృవ ప్రాంతాన్ని జల్లెడపట్టి, సమస్త వివరాలను సేకరించి, చంద్రయాన ప్రయోగాల్లో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది.

No comments:

Post a Comment