విజయవాడ, జూలై 19 (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 23న తొలుత తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. 23న భువనేశ్వర్ నుంచి విమానంలో బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తిరుమల వెళతారు. వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం విజయవాడ చేరుకుంటారు. ఈనెల 24న ఆయన ఏపీ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేస్తారు.
24న ఏపీ కొత్త గవర్నర్ బాధ్యతలు
ఉదయం 11.30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేయనున్నట్లు సమాచారం.భవనంలోని మొదటి అంతస్థుని గవర్నర్ నివాసం కోసం, కింది భాగాన్ని కార్యాలయ నిర్వహణకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముకేష్ కుమార్ మీనా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు గవర్నర్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు
No comments:
Post a Comment