Breaking News

07/06/2019

పుస్తకాల పేరుతో మరో బాదుడుకు ప్రైవేట్ స్కూల్స్ రెడీ


వరంగల్ జూన్ 7, (way2newstv.in)
వేసవి సెలవుల తర్వాత  మరో నాలుగు రోజుల్లో స్కూల్స్  ప్రారంభం కానున్నాయి. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా చదివించేందుకు పేరంట్స్ ఖర్చుకైనా వెనుకాడడం లేదు. వారి ఆశలనే పెట్టుబడిగా చేసుకుని ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలలు అక్షరాలకు వెల కడుతున్నాయి. ఫీజులపై ప్రభుత్వం నియంత్రణ కొరవడడంతో ప్రయివేటు విద్యాసంస్థలు ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నాయి. విద్యాహక్కు చట్టం కూడా సరిగా అమలు కావడం లేదు. 45 రోజుల వేసవి సెలవుల తర్వాత  స్కూల్స్ పున: ప్రారంభం కానున్నాయి. అయితే వీటికి నెల రోజుల ముందు నుంచే పాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. దీంతో పాఠశాలల్లో చేర్పించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు అష్టకష్టాలు పడుతున్నారు. అడ్మిషన్లు దొరికిన వారు పాఠశాల సామగ్రి కొనడంలో బిజీబిజీ అయ్యారు. ఫీజు, యూనిఫాం, టై, బూట్లు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు.. ఇలా విద్యార్థికి అవసరమైన వస్తువులు కొనడంలో బిజీ అయ్యారు. 


పుస్తకాల పేరుతో మరో బాదుడుకు ప్రైవేట్  స్కూల్స్ రెడీ
కొన్ని పాఠశాలల్లోనైతే ఈ వస్తువులన్నీ తమ చోటే కొనాలనే నిబంధనలు ఉండడంతో తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.మార్కెట్‌లో పిల్లలకు సంబంధించిన పుస్తకాలు బ్యాగులు, వాటర్‌బాటిళ్లు, షూస్‌, ఇలా అన్ని రకాల వస్తువుల ధరలు పెరగడం తల్లిదండ్రులకు భారంగా మారింది. తోటి పిల్లలు రకరకాల వస్తువులు తెచ్చుకుంటుంటే తమ పిల్లలకు కావలసిన అన్ని వస్తువులు ఖరీదెంత అయినా సరే కొనుగోలు చేసి ఇస్తున్నారు.. బ్యాగు బరువుతో ఇబ్బంది పడే విద్యార్థులు పై అంతస్తుల్లోని తరగతులకు వెళ్లడానికి తంటాలు పడుతున్నారు. రెగ్యులర్‌ సిలబస్‌ పుస్తకాలతోపాటు డ్రాయింగ్‌ క్రాఫ్ట్‌, ఆర్ట్‌, జీకే, కంప్యూటర్‌, ఆసైన్‌మెంట్‌, డైరీ, రిజిస్టర్‌ వంటి పుస్తకాలతోపాటు క్లాస్‌ వర్క్‌, హోంవర్క్‌, తెలుగు, హింది, ఇంగ్లీష్‌, సైన్స్‌, మ్యాథ్స్‌, సోషల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడిస్‌ ఇలా ఒక్కో సబ్జెక్ట్‌కు2 నంచి 3 చొప్పున నోట్‌బుక్స్‌, అట్లాస్‌, డిక్షనరీ, స్పోర్ట్స్‌ డ్రెస్‌ వంటి వాటితో స్కూల్‌ బ్యాగు మోయలేని భారం అవుతున్నది. యూకేజీ చదివే విద్యార్థి 14 కిలోలు ఉంటే, బ్యాగు బరువే 3.5 కిలోలకు పైనే ఉంటుందని విద్యాశాఖ ఆంచనా.. మూడో తరగతి విద్యార్థి బరువు 22కిలోలు ఉంటే అతని పుస్తకాల బరువు 8 కిలోలకు పైనే. 3.5కిలోల బరువుండే ఏడో తరగతి విద్యార్థి బ్యాగు బరువు 10 కిలోలకు పైనే  మోయాల్సి వస్తోంది.మరో వైపు స్కూల్‌ బ్యాగ్‌ బరువు అధికంగా ఉంటే ఖరీర ఎదుగుదల డెబ్బతింటుంది. ఎముకలు, కండరాల, పెరుగుదలపై ప్రభావం పడుతుంది. మెడ, భుజాలు, వెన్నుపూస పైభాగం, వెన్నుపూస కింది భాగం దెబ్బతింటాయి. దీంతో వెన్నునొప్పి వస్తుంది. వెన్నుముక భుజాలు వంగిపోతాయి. ఈ ప్రభావం బాలికలపై తీవ్రంగా ఉంటుంది. విద్యార్థులు ఎక్కువ అలసటకు గురవుతారు. శ్వాస సరిగ్గా పీల్చుకోలేని పరిస్థితి వస్తుంది.నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యార్థులు స్కూల్‌ పుస్తకాలు మోయకూడదని... ఇతర తరగతుల వారు విద్యార్థి శరీర బరువుకంటే స్కూల్‌ బ్యాగు బరువు 10శాతం మించి ఉండకూడదని... మార్గదర్శ కాలు ఉన్నాయి. స్కూల్‌బ్యాగు బరువు, రోజూ తెచ్చుకోవాల్సిన పుస్తకాలపై శాస్త్రీయ ఆంచనాతో పాఠశాలలు విద్యార్ధుల తల్లిదండ్రులకు మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉన్నా.. పట్టించుకొనేవాడే లేడు. కొన్ని ప్రయివేటు పాఠశాలల్లో యాజమాన్యాలే విద్యార్థుల పుస్తకాలను స్కూల్లో పెట్టుకునేందుకు ప్రతి విద్యార్ధికి లాకర్లు, డెస్క్‌లను ఏర్పాటు ఉన్నా వాటికి సెక్యూరిటీ లేకపోవడంతో చిన్న పిల్లలు పుస్తకాలు మోయడం తప్పని సరవుతోంది. వాస్తవానికి  ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలను పాటించకపోయినా ఆయా స్కూళ్లపై చట్టపరంగా చర్యలు చేపట్టాలి. రూ. 3లక్షల వరకు జరిమానా విధించవచ్చు. జరిమానా విధించిన తర్వాత కూడా నిబంధనలను పాటించకపోతే పాఠశాలల గుర్తింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది.ప్రయివేటు పాఠశాలల్లో ఉపయోగిస్తున్న పుస్తకాలకు సంబంధించిన ధరలు చూస్తే విస్తుపోవాల్సిందే. గతేడాది నర్సరీ, యూకేజీ, ఎల్‌కేజీ చదివే పిల్లలకు వెయ్యికి తగ్గకుండా పుస్తకాలు నోటు పుస్తకాలు తీసుకున్నారు. ఈ సారి అవి మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే పేపర్‌ ధర పెరగడంతో పుస్తకాలు. నోట్‌పుస్తకాల ధరలు మరింత పెరగవచ్చంటున్నారు. అయితే ఆయా పాఠశాలల యాజమాన్యాలు పుస్తకాలు, నోట్‌ పుస్తకాలతో పాటు బ్యాగులను కూడా తమ వద్దనే కొనాలనే నిబంధనలు విధిస్తున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే కొనాల్సి వస్తున్నది.

No comments:

Post a Comment