Breaking News

18/06/2019

పరుగుల పెడితే డబుల్ ఇళ్ల నిర్మాణం

హైద్రాబాద్, జూన్ 18 (way2newstv.in)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్‌రూం పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలకు సొంతింటి కల సాకారం చేయాలనే లక్షంతో సిఎం కెసిఆర్ డబుల్ బెడ్‌రూం పథకాన్ని ప్రకటించడంతో పాటు ఆయనే స్వయంగా పలు మార్లు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించి రాష్ట్ర స్థాయి అధికారులకు దశ దిశను కూడా నిర్ధేశించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో ప్రభుత్వం కేటాయించిన ఇండ్ల నిర్మాణ పనులను శరవేగంగా సాగుతున్నాయి. ఇంటి నిర్మాణ పనుల తీరు తెన్నులను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ పర్యవేక్షస్తుంది. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని రాష్ట్ర గృహా నిర్మాణ సంస్థ ఎస్‌ఇ చైతన్య కుమార్ తెలిపారు.అధికారిక సమాచారం ప్రకారం అనేక జిల్లాల పరిధిలో టెండర్‌లను ఆహ్వానించి, అత్యధిక సంఖ్యలో టెండర్‌ల ప్రక్రియను పూర్తి చేశారు. అలాగే పలు జిల్లాల పరిధిలోని అనేక సైట్‌లలో నిర్మాణ పనులు పూర్తి చేసి, ఆయా జిల్లాల కలెక్టర్‌ల సారధ్యంలో అర్హులకు కేటాయింపులను పూర్తి చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 1,99,835 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులకు గాను టెండర్‌లను ఆహ్వానించగా, టెండర్ దశలను పూర్తి చేసి 1,79,078 ఇండ్ల నిర్మాణ పనులకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. 


పరుగుల పెడితే డబుల్ ఇళ్ల నిర్మాణం
ఇదిలా ఉండగా పలు జిల్లాల పరిధిలో నిర్మాణ పనులు తుది దశకు చేరుతున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాల పరిధిలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమాలకు ఆయా జిల్లా కలెక్టర్‌లు కార్యచరణ ప్రణాళికలు ఖరారు చేస్తున్నారు. గేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణం లక్షంగా నిర్ధేశించుకోగా 97,722 ఇండ్ల పనులకు టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించారు.ఇందుకు గాను రూ.3,710కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నారు. మిగితా జిల్లాల పరిధిలో ప్రభుత్వం కేటాయించిన1,80,616 ఇండ్ల నిర్మాణానికి గాను రూ.2,380 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లాకు రూ.434 కోట్ల నిధులు, ఖమ్మం జిల్లాకు రూ.220కోట్ల నిధులు,రాజన్న సిరిసిల్ల జిల్లాకు రూ.141 కోట్లు, భద్రాది కొత్తగూడేం జిల్లాకు రూ.137 కోట్లు, మహాబుబ్‌నగర్ జిల్లాకు రూ.134 కోట్లు, కామారెడ్డి జిల్లాకు రూ.126 కోట్లు, సూర్యాపేటకు రూ.123 కోట్ల, నల్గొండ జిల్లాకు 114 కోట్లు, సంగారెడ్డి జిల్లాకు రూ.104 కోట్లు,జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాకు రూ.101 కోట్లు నిధులను కేటాయించారు.గ్రేటర్ హైదరాబాద్‌కు లక్ష, ఖమ్మం జిల్లాకు 14,560, సిద్ధిపేట జిల్లాకు 12,903, నిజామాబాద్ జిల్లాకు 11,066, మహబుబ్‌నగర్ జిల్లాకు 10,689, జగిత్యాల జిల్లాకు 8,730, నల్గోండ జిల్లాకు 8,155, కామారెడ్డి జిల్లాకు 7,220 రాజన్న సిరిసిల్ల జిల్లాకు 7,169, రంగారెడ్డి జిల్లాకు 6,777 కరీంనగర్ జిల్లాకు 6,564, భద్రాది కోత్తగూడేం జిల్లాకు 6,438,నిర్మల్ జిల్లాకు 6,273, జయశంకర్ భూపాల పల్లి జిల్లాకు 5,678, సంగారెడ్డి జిల్లాకు 5,555, మెదక్ జిల్లాకు 5,514, మహబుబాబాద్ జిల్లాకు 5,427, వరంగల్ అర్భన్ జిల్లాకు 5,221, సూర్యపేట జిల్లాకు 5,614, వరంగల్ గ్రామీణం జిల్లాకు 4,142, మంచిర్యాల జిల్లాకు 4,272, అదిలాబాద్ జిల్లాకు 4,195, జనగాం జిల్లాకు 4,789, వికారాబాద్ జిల్లాకు 4,323, నాగర్‌కర్నూల్ జిల్లాకు 2,701,పెద్దపల్లి జిల్లాకు 3,352, యాద్రాద్ధి భువనగిరి జిల్లాకు 3,506, జోగులాంబ గద్వాల జిల్లాకు 2,800, వనపర్తి జిల్లాకు 2,410, మేడ్చల్ జిల్లాకు 2,350, కొమరంభీం జిల్లాకు 1,223 కేటాయించారు.

No comments:

Post a Comment