Breaking News

15/06/2019

బెల్ట్ షాపులు అంత ఈజీ కాదు


శ్రీకాకుళం, జూన్ 15, (way2newstv.in)
వై ఎస్. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలోని బెల్ట్ షాపులు నిర్మూలిస్తాం...మద్యం దుకాణాలను బంద్ చేయిస్తామన్న మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు సీఎం కావడంతో జగన్మోహన్ రెడ్డి మద్యం దుకాణాలు పై ఆంక్షలు విధించి బెల్ట్ షాపులను నిర్మూలించాలంటూ ఎక్సైజ్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.దీంతో ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపుల పై ఉక్కుపాదం మోపుతున్నారు.ఈ నేపధ్యంలోనే శ్రీకాకుళం జిల్లాలో మద్యం దుకాణాల ద్వారా బెల్ట్ షాపులకు అక్రమ రవాణా చేస్తున్న వారిపైన ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తున్నారు.శ్రీకాకుళం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు మెరుపుదాడులు చేస్తున్న నేపథ్యంలో మద్యం దుకాణాల నుంచి అక్రమంగా గొలుసు దుకాణాలకు విచ్చలవిడిగా సరఫరా చేస్తున్న వారిపై నియంత్రణ చేస్తున్నా...అడ్డూ ఆపు లేకుండా రెచ్చిపోతున్నారు 


బెల్ట్ షాపులు అంత ఈజీ కాదు
అక్రమార్కులు.దీంతో ఎక్సైజ్ అధికారులు తమదైన శైలిలో జిల్లాలో బెల్ట్ షాపులు నిర్వహించే వారి పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నా...పట్టించుకోవడంలేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని చౌదరీ వైన్ షాపు నుంచి బెల్ట్ షాపులకు తరలించడానికి సిద్ధంగా ఉంచిన 372 మధ్యం సీసాలను,ఓ వాహనంతో పాటు నలుగురు వ్యక్తుల పై దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు.పాలకొండలోని చౌదరీ మద్యం దుకాణం నుంచి అక్రమంగా బెల్ట్ షాపులకు తరలించేందుకు ఉంచినట్లు అక్రమార్కులు చెప్పడంతో వారి పై ఎక్సైజ్ అధికారులు కేసునమోదు చేసి మధ్యం షాపు లైసెన్స్ ను రద్దుచేస్తామని సంబంధిత అధికారులు చెపుతున్నారు.బెల్టుషాపులు ఎత్తివేయడంతో జిల్లాలోని సీతంపేట, పాలకొండలో నాటుసారా వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు.దీంతో అధిక సంఖ్యలో నాటుసారాకు అలవాటు పడి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.ముఖ్యంగా పాలకొండ రెల్లివీధిలో నాటుసారాను విచ్చలివిడిగా ఈ నాటుసారాను విక్రయిస్తున్నారు.ఎక్సైజ్ అధికారులు బెల్టుషాపులను అరికడుతున్నప్పటీకీ నాటుసారాను మాత్రం అరికట్టేందుకు ఎక్సైజ్ అధికారుల ప్రయత్నం విఫలం చెందుతున్నారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment