Breaking News

08/05/2019

సీఎస్ వైపు అధికారులు...

అమరావతి, మే 8, (way2newstv.com)
ఏపీలో సీఎం చంద్రబాబు వర్సెస్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంగా జరుగుతున్న పోరాటంలో ఐఏఎస్ అధికారులంతా సీఎస్ కు అండగా నిలవాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది.హోటల్లో సమావేశమైన ఐఏఎస్ లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి అండగా నిలవాలని నిర్ణయించుకోవడంతో చంద్రబాబు ఒంటరి అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురు సీనియర్లు కూడా హాజరయ్యారు.ఏపీలో సీఎం చంద్రబాబు వర్సెస్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంగా జరుగుతున్న పోరాటంలో ఐఏఎస్ అధికారులంతా సీఎస్ కు అండగా నిలవాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏపీలో ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆరోపణలపై అప్పటి సీఎస్ అనిల్ చంద్ర పునేఠాపై వేటు వేసిన ఈసీ... ఎల్వీ సుబ్రహ్మణ్యానికి బాధ్యతలు అప్పగించింది. దీనిపై సీఎం చంద్రబాబు బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కారు.  


సీఎస్ వైపు అధికారులు...

జగన్ కేసుల్లో నిందితుడికి సీఎస్ బాధ్యతలు ఎలా అప్పగిస్తారంటూ తీవ్ర వాఖ్యలు చేశారు. దీనిపై ఐఏఎస్ అధికారులుల్లోనే భిన్న స్వరాలు వినిపించాయి. ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న ఐఏఎస్ లు చంద్రబాబుకు మద్దతు పలకగా... మిగతా వారు జగన్ కు అండగా నిలిచారు. ఆ తర్వాత కూడా కీలక రివ్యూల విషయంలో సీఎస్ వ్యవహారశైలిపై చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలంతా తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు.  అప్పట్లో విజయవాడ పున్నమి ఘాట్ లో నిర్వహించాల్సిన ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశం కోరం లేక వాయిదాపడింది.ఓ ప్రముఖ హోటల్లో నిర్వహించిన సమావేశానికి భారీగా ఐఏఎస్ లు హాజరయ్యారు. వీరిని సమావేశానికి తీసుకురావడంలో ఇద్దరు మాజీ సీఎస్ లు కీలకంగా వ్యవహించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఐఏఎస్ లు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో ఎవరున్నా... అధికారులుగా తమ బాధ్యత నిర్వహించడం తప్పనిసరని వారంతా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే ప్రస్తుత సీఎస్ గా ఎల్వీకి మద్దతునివ్వాలని నిర్ణయించారు. వీరిలో ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తున్న వారు హాజరై ఎల్వీకి అండగా నిలవడం సహజంగానే ప్రభుత్వ వర్గాలకు మింగుడుపడటం లేదు.రాష్ట్రంలో టీడీపీ మరోసారి అధికారం నిలబెట్టుకోవడం కష్టమనే వాదన వినిపిస్తున్న వేళ.. ఐఏఎస్ అధికారులు కూడా సీఎస్ అయిన ఎల్వీఎస్ ను వ్యతిరేకించడం మంచిది కాదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఒక వేళ వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే సీఎస్ గా ఎల్వీని కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు మాజీ సీఎస్ లు అయిన ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లం సేవలను కూడా విస్తృతంగా వాడుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో మాజీ ఐఏఎస్ లు సైతం ప్రస్తుత సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి అండగా నిలిస్తేనే మంచిదని భావిస్తున్నట్లు తెలిసింది.  ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగావే ఇవాళ చంద్రబాబు నిర్వహించిన పోలవరం రివ్యూకు గోదావరి జిల్లాల కలెక్టర్లతో పాటు జలవనరులశాఖ కార్యదర్శి కూడా డుమ్మాకొట్టారనే ప్రచారం కూడా సాగుతోంది. అదే నిజమైతే నాలుగు రోజుల్లో నిర్వహించే కేబినెట్ భేటీకి కూడా సమస్యలు తప్పకపోవచ్చని తెలుస్తోంది. సీఎస్, ఎన్నికల ప్రధానాధికారిని కాదని కీలకమైన కేబినెట్ భేటీ నిర్వహించేందుకు చంద్రబాబు సిద్ధమైతే రాజ్యాంగ సంక్షోభం కూడా తప్పదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

No comments:

Post a Comment