Breaking News

20/05/2019

భగభగలాడుతున్న సూరీడు


హైద్రాబాద్, మే 20  (way2newstv.in)  
భానుడు భగభగలాడిపోతున్నాడు. మండుతున్న ఎండలతో ప్రజలపై పగ తీర్చుకుంటున్నాడా అన్నట్లుగా ఉంది నగరంలోని వేడి. కాంక్రిట్ జంగిల్ గా మారిపోయిన హైదరాబాద్ నగరంలో వేసవివచ్చిదంటే చాటు ప్రజలు హడలిపోతున్నారు. 10 దాటికుండానే రోడ్లపై జనాలు కనిపించటంలేదు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నగరంలోని పలు ప్రాంతాలలో  ఆదివారం (మే19) 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ  శాఖ తెలిపింది. తెలంగాణ స్టేట్ డెవెలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ  తెలిపిన వివరాల ప్రకారం..బహదూర్ పురాలు 43.8 డిగ్రీలు..అమీర్ పేట 43.4, మాదాపూర్ 43.2, బీహెచ్ఈఎల్ 43.1 డిగ్రీలు,ఉష్ణోగ్రత 42.7  సెల్షియస్ గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా మరో మూడు రోజుల పాటు వడగాలులు వీస్తాయని వాతారవణ శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో భద్రాచలం, ఖమ్మం, రామగుండం, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీల చొప్పున అధిక టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, నల్గొండ, హన్మకొండ జిల్లాల్లో 43 డిగ్రీలు చొప్పున రికార్డయ్యాయి


భగభగలాడుతున్న సూరీడు

వడదెబ్బ బారిన పడుతున్న 10 మంది 
రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలో భవనాలు పెరుగుతున్నాయి. వృక్షాల సంఖ్య తగ్గుతోంది. దీంతో ఎండల ధాటికి ప్రజలకు తట్టుకోలేకపోతున్నారు. దీంతో వడదెబ్బకు అల్లాడిపోతున్నారు. ఇలా రోజుకు  హైదరాబాద్ లో 10మంది వడదెబ్బ బారిన పడుతున్నారు. దీంతో వారు ఆస్పత్రులవుతున్న కేసుల ద్వారా ఈ విషయం వెల్లడవుతోంది. రోజుకు 10మంది వడదెబ్బ బాధితులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.  రాష్ట్రంలో రోజురోజు ఉష్ణోగ్రత పెరుగుతుండటంతో..ఆసుపత్రులలో పలు కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో నగరంలోని అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రులైన గాంధీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ రోజువారీ 10 హీట్ స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.  
ప్రయివేటు ఆస్పత్రులలో ప్రతీరోజు కనీసం 4 కేసులు నమోదవుతున్నాయని కాంటినెంటల్ ఆస్పత్రి డాక్టర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. సన్ స్ట్రోక్ బారిన పడిన చాలామంది రోగులు తలనొప్పి, ఫీవర్ వంటి సమస్యలతో జాయిన్ అవుతున్నారని తెలిపారు. 

No comments:

Post a Comment