Breaking News

22/05/2019

కర్ణాటకలో మధ్యంతరం...?


బెంగళూర్, మే 22 (way2newstv.in): 
కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం... తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారవుతోంది. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ కలిసి... 10 కంటే తక్కువ లోక్ సభ స్థానాలు సాధించి, మాండ్యలో సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ ఓడిపోతే... ప్రభుత్వం కూలిపోతుందని జేడీఎస్, కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే... లోక్ సభ ఎన్నికలతోపాటూ... కర్ణాటకలోని కుండగల్, చించోళీ అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు స్థానాలూ గెలుస్తామని బీజేపీ అంటోంది. అలాగైతే అసెంబ్లీలో ఆ పార్టీ బలం 106కి చేరుతుంది. 

కర్ణాటకలో మధ్యంతరం...?

ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్లు బీజేపీతో ఉన్నారు. అలాంటి సమయంలో... జేడీఎస్‌ను తమవైపు లాక్కొని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే జేడీఎస్‌తో కలవడం వల్ల తాము బాగా నష్టపోయాని చాలా సందర్భాల్లో కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లడమే మంచి ఆప్షన్ అంటున్నారు వాళ్లు. ఇలా మూడు పార్టీలూ వేటికవే రాజకీయ వ్యూహాలు రచిస్తున్నాయి.ఇదే సమయంలో.. ముఖ్యమంత్రి కుమారస్వామి... ఢిల్లీకి వెళ్లాల్సిన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈవీఎంలపై 21 పార్టీలు చేపట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. మంగళవారం ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచీ బయల్దేరాలనుకున్న ఆయన... చివరి నిమిషంలో టూర్ కేన్సిల్ చేసుకున్నారు. ఎందుకన్నది మాత్రం చెప్పలేదు. ఫలితాల తర్వాత జేడీఎస్... ఎవరితో వెళ్లాలన్నదానిపై... ఫలితాల తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో... ముందుగానే యూపీఏ పక్షాలకు దూరం జరుగుతున్నారా అన్న డౌట్ కలుగుతోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల్ని బట్టీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోకపోతే, పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం అని భావిస్తున్నట్లు తెలిసింది.

No comments:

Post a Comment