Breaking News

20/05/2019

అక్రమాల అంతస్తులు (కరీంనగర్)

కరీంనగర్, మే 20 (way2newstv.in): 
జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అక్రమ, అనధికారిక నిర్మాణాలు, అదనపు అంతస్థుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. లేవుట్లకు విరుద్ధంగా ప్లాట్లు చేసి ప్రజలకు విక్రయించిన స్థలాల్లో నిర్మించుకోవడం, ఇందులో ఇళ్ల నిర్మాణాలకు అనుమతి తీసుకోవడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి నిర్మాణాలన్నీ భవన క్రమబద్ధీకరణ పేరుతో సక్రమం చేసుకునే అవకాశం ఉందనే ధీమాతో ఉన్నారు. అయితే ఈ అంశం కొన్నేళ్లుగా న్యాయస్థానంలో ఉండటం, దీనిపై కోర్టు ఆగ్రహంగా ఉండటంతో ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై భారీగా జరిమానా వేసేందుకు చర్యలు చేపట్టింది. 25 నుంచి 100 శాతం వరకు ఆస్తిపన్ను మదింపుతో అదనంగా పన్ను మదింపు కార్యక్రమాన్ని తీసుకుంది. అయినప్పటికీ అక్రమ నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. 


అక్రమాల అంతస్తులు (కరీంనగర్)

అక్రమ, అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్థుల సంఖ్య పెరిగిపోయింది. గతంలో ఎన్ని అంతస్థులకు అనుమతి తీసుకుంటే అంతవరకే నిర్మాణాలు చేపట్టేవారు. ఇటీవల అలాకాకుండా అదనంగా నిర్మాణాలు చేసుకుంటున్నారు. పాత ఇళ్లను కూల్చివేసి జీ+1 నుంచి జీ+4 వరకు నిర్మాణాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు. రోడ్డు ఇరుకుగా ఉన్న ప్రాంతాల్లో మార్టిగేజ్‌ లేకుండా  నిర్మాణాలు చేస్తూ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. అనుమతి ఉన్నా, లేకున్నా భవన నిర్మాణ సమయంలో కొంతమేర రోడ్డు వైపు స్థలం వదలాల్సి ఉంటుంది. అనుమతి తీసుకున్న భవనాలకైతే అనుమతి పత్రంలోనే సెట్‌బ్యాక్‌ ఎంత వదలాలనే విషయం స్పష్టంగా ఉంటుంది. కరీంనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్డు మీదికే వచ్చి భవన నిర్మాణాలు చేస్తున్నారు. అంతేకాకుండా నిబంధనల ప్రకారం గేటు లోపలి భాగం తెరిచేలా ఉండాలి. కొందరు అత్యుత్సాహంతో గేటు బయటకు తెరిచేలా నిర్మిస్తూ రాకపోకలు సాగించే ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తున్నారు.

No comments:

Post a Comment