గాడి చెర్ల పల్లి వరకు సెంటర్ లైటింగ్ తో నాలుగు వరుసల రహదారి
సిద్దిపేట, మే 31 (way2newstv.in)
సిద్దిపేట పట్టణం ముస్తాబాద్ చౌరస్తా నుండి 29వ వార్డు గాడిచెర్ల పల్లి వరకు పోర్ లైన్ రోడ్డు కు మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం శంకుస్థాపన చేశారు...ఈ సందర్భంగా మాట్లాడుతూ 16.55కోట్ల తో ముస్తాబాద్ చౌరస్తా నుండి గాడి చెర్ల పల్లి వరకు 4.5 కిమి ఉన్న రెండు వరసల రహదారి ని నాలుగు వరుసల రహదారి గా మారుస్తూ.. ఈ రహదారి సెంటర్ లైటింగ్ ,
నగరాల తరహాలో పట్టణ రహదారులు...
పట్టణంలో ఏవిధంగా అయితే మధ్యలో డివైడర్ , చెట్లు ఉన్నాయో అదే మాదిరిగా ఈ రహదారి అద్భుతంగా,సుందరంగానిర్మిస్తా మన్నారు..వాహన చోదకులకు ప్రమాదాలు జరగకుండా అన్ని రేడియం.. స్టడ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.. పట్టణంలో ప్రజా అవసరాల దృష్ట్యా పెరిగిన జనాభా దృష్టిలో పెట్టుకొని సిద్దిపేట నలు దిక్కుల్లో రహదారులను అభివృద్ధి చేస్తుమన్నారు..ఇప్పటికే పనులు ప్రారంభం కాగా వచ్చే 6నెలల్లో పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు..
No comments:
Post a Comment