Breaking News

21/05/2019

మార్కెట్లో రూ.30 నుంచి 6 వేల వరకు అత్తర్లు


హైద్రాబాద్, మే 21, (way2newstv.in)
అత్తర్ గుబాళింపు మనసును ఆహ్లాదపరుస్తుంది. విభిన్న రకాల ఫ్లేవర్స్ లో అత్తర్లు మార్కెట్ లో అందుబాటు లో ఉన్నాయి . మాములు రోజుల్లో కంటే రంజాన్ మాసంలో ముస్లింలు వీటిని అధికంగా వినియోగిస్తుం టారు. ప్రార్థన చేసే ముందు అత్తర్ పూసుకోవడం ముస్లిం ల ఆచారం. ముఖ్యం గా రంజాన్ మాసంలో అత్తర్ లను ఎక్కువగా కొనుగోలు చేయడానికి ముస్లిం లు ఇష్టపడతారు. ప్రస్తు తం వీటి కొనుగోళ్లు పెరిగాయి. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లోలభిం చే అత్తర్ షాపులు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి .చలి, వర్షాకాలంలో షామమతుల్ అమ్, హ్రీనా,జాప్రాన్, దహనల్ ఊద్ వంటి రకాల అత్తర్లు వాడితే సువాసనతో పాటు ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తాయి . 



మార్కెట్లో రూ.30 నుంచి 6 వేల వరకు అత్తర్లు

అదే విధంగా జన్నతుల్ ఫిర్దోస్,మజ్మా, షాజహాన్, మన్నా, నాయబ్, హుప్,బకూర్, మొకల్లత్ , ఖస్, ఇత్రేగిల్, షమామతుల్ అంబర్, హీనా, జాప్రత్, దహనుల్ ఊద్ వంటి రకాలు మార్కెట్ లో విరివిగా లభిస్తున్నాయి . మార్కెట్ లో తులం అత్తర్ రూ.200 ఉండగా, అరబ్ లు అత్యం త ఇష్టపడే దహనల్ ఊద్ మాత్రం రూ.2వేల నుం చి రూ. 6వేల వరకు ఉంటుంది . రాత్ కి రాణి (నైట్ క్వీన్ )ముస్క్ రోజ్, బ్లాక్ ముస్క్, వైట్ ముస్క్, కూల్ బ్రీజ్, జమ్ జమ్ ఫ్లవర్ వంటి అనేక రకాల అత్తర్లు, ఫర్ఫ్యూమ్ లు ఖరీదైనవి. అత్తర్ లను 3ఎంఎల్ నుం చి అమ్ముతా రు. అత్తర్లు సామాన్యులకు అందుబాటు లో ఉన్నాయి . 3 ఎంఎల్ కు రూ.30ల ధరతో కొన్ని రకాల అత్తర్ లభిస్తు న్నాయి .అత్తర్ తయారు చేసేందుకు పూలను ఉపయోగిస్తారు. మల్లెపూలు, గులాబీ రేకులు, గంధపు చెక్కలు, మొగలిపూల ఆవిరే అసలైన అత్తరు. ఎంతకాలం ఎక్కువగా భద్రపరిస్తే అంత ఎక్కువగా సువాసన వెదజల్లు తుంది .గులాబీ రేకులు, మల్లె, మొగలి పూలతో పాటు గంధం రకరకాల సువాసన ఇచ్చే చెట్ల చెక్కలు ఎండిన తర్వాత వాటిని పెద్ద పెద్ద బానాలలో వేస్తారు. వాటిని భూమిలో పాతి మరగబెడతారని, బానాలపై చిన్న మార్గం ద్వారా ఆవిరి బయటకు వచ్చేలా రంధ్రం చేస్తారని వ్యాపారులు తెలిపారు. ఇలా తయారైన అత్తర్ ను వ్యాపారులు తమకు నచ్చిన సైజుల్లో రకరకాల పేరుతో విక్రయిస్తున్నారు.

No comments:

Post a Comment