Breaking News

07/05/2019

16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు

హైద్రాబాద్, మే7, (way2newstv.in)
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు మే 15న డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ కానుంది. ఈ నెల 16 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో దోస్త్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి,వైస్ ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ ఆర్.లింబాద్రి,మరో వైస్ ఛైర్మన్ వి.వెంకటరమరణ, కమిషనర్ నవీన్ మిట్టల్, యూనివర్సిటీల వైస్ ఛాన్స్‌లర్లు తదితరులు పాల్గొన్నారు. కళాశాల విద్యాశాఖ , యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్లు పాల్గొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి దోస్త్‌లో ఆన్‌లైన్ రిపోరింగ్‌తో పాటు ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించే విధానం తీసుకురావాలని నిర్ణయించారు. 


16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు 

విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు టివాలెట్ ద్వారా పేమెంట్ గేట్ వే సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు ఉమ్మడి జిల్లా కేంద్రాలలో 10 హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో గతంలో దోస్త్ దరఖాస్తు ప్రక్రియలో, సీట్ల కేటాయింపులో తలెత్తిన పలు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చర్చించారు. దోస్త్ దరఖాస్తు ప్రక్రియ సరళంగా ఉండేలా వెబ్‌సైట్‌లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు.వచ్చే విద్యాసంవత్సరంలో జూన్ వ తేదీ నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. దోస్త్ నోటిఫికేషన్ మే 15న విడుదల చేసి, మే 16 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 30లోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేసి కళాశాలల్లో రిపోర్టింగ్ చేసేందుకు అవకాశం కల్పించి జూలై 1 నుంచి డిగ్రీ సెమిస్టర్ తరగతులు ప్రారంభించనున్నారు

No comments:

Post a Comment