Breaking News

09/04/2019

కులపిచ్చి...శివాజీ...అంటూ ఊగిపొయిన పోసాని

హైద్రాబాద్, ఏప్రిల్ 9, (way2newstv.in)
ఆపరేషన్ గరుడు శివాజీ.. ఏపీ రాజకీయాల్లో గుబులు రేపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా బీజేపీ వేలాది కోట్ల రూపాయలతో ప్లాన్ చేస్తోందని.. ఏపీలో కీలకనేతపై దాడి చేసి అల్లర్లు సృష్టించి రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ.. అప్పట్లో ‘ఆపరేషన్ గరుడ’ అంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు శివాజీ. ఇక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తరుపున విరివిగా ప్రచారం నిర్వహిస్తున్న శివాజీ.. మరో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నా అంటూ ముందే ప్రకటించి.. రహస్యాలను, సాక్ష్యాలను బయటపెడతానని.. జగన్ వ్యతిరేక పత్రికలో వచ్చి కథనాలను ప్రెస్ మీట్‌లో బిగ్ స్క్రీన్‌పై చూపించారు. ఈ సందర్భంగా జగన్, కేసీఆర్‌లపై సంచలన కామెంట్స్ చేస్తూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఇక శివాజీ పవన్ పాయింట్ ప్రజెంటేషన్‌కి కౌంటర్ ప్రెస్ మీట్ నిర్వహించారు వైసీపీ నేత, సినీ దర్శక, రచయిత పోసాని క్రిష్ణమురళి. ఈ సందర్భంగా శివాజీపై పలు సంచలన ఆరోపణలు చేశారు పోసాని. ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ దగ్గరపడ్డాయి. మాకు ఇచ్చిన టైంలో మాకు నచ్చిన నాయకుల గురించి మాట్లాడుతుంటాం. నచ్చని నాయకులను తిడుతుంటాం.. విమర్శిస్తుంటాం. 


కులపిచ్చి...శివాజీ...అంటూ ఊగిపొయిన పోసాని

నేను చెప్పేది నా గురించి కాదు. ఒక మనిషి ఎన్నిరకాలుగా ఊసరవెల్లిలా మారతాడో చెప్పడానికి ఈ ప్రెస్‌మీట్ పెట్టడం జరిగింది. ఆ మనిషి ఎవరంటే.. హీరోగా ఒకప్పుడు తెలుగు పరిశ్రమలో ఉన్న శివాజీ. ఆ శివాజీ సడెన్‌గా వచ్చి ఏం మాట్లాడతారో చెబుతా. తాజాగా శివాజీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మహానుభావుడు.. జగన్ దుర్మార్గుడు అంటున్నాడు. మూడు గంటలు పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. గతంలో చంద్రబాబు ఎవరూ చేయని విమర్శలు చేశారు శివాజీ. జగన్‌కి విజన్ ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు అన్నారు. కాని సడెన్‌గా ప్లేట్ ఫిరాయించారు. శివాజీ.. ఆఫ్ ద రికార్డ్ చాలా మాట్లాడాడు. వాటిని ఇప్పుడు చెప్పక పరిస్థితి. టీవీ 9 రవి ప్రకాష్ గురించి ఎంత నీచంగా మాట్లాడాడో చెప్పడానికి నాకే సిగ్గుగా ఉంది. నేను నిజాలను బట్టి మాట్లాడుతా. నేను టీవీ 9 స్టాఫ్‌ని అడిగా.. శివాజీ ఎప్పుడూ మీ ఛానల్‌లోనే కనిపిస్తారు. మిగతా ఛానల్స్‌లో ఎందుకు కనిపించరని అంటే.. మా ఖర్మ అన్నాడు.‘రవి ప్రకాష్‌కి ఏం అవసరమో అవి నేను సప్లై చేస్తున్నా.. నాకు ఏం కావాలో రవి ప్రకాష్ సప్లై చేస్తున్నాడు. అదీ మా ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం అన్నారు శివాజీ. అదేంటి? రవి ప్రకాష్‌‌ని మనవాడు మనవాడు అంటారు అతనికి కుల పిచ్చి లేదు కదా. కులం ఉండకూడదు.. కులం చూసిన వాడు గాడిద అంటూ టీవీ9లో చెప్తాడు కదా.. అంటే. అతని కుల పిచ్చి గురించి నీకేం తెలుసు. టీవీలో చూపించేవి ప్రజలకు చెప్పడానికి మాత్రమే నిజానికి అతనికి చాలా కులపిచ్చి. ఆ పిచ్చితోనే మేం ఇద్దరం దగ్గరయ్యాం’. నేను.. రవి ప్రకాష్, రాధాక్రిష్ణ ఒకే కులం జగన్ తాట తీస్తాం అన్నాడు శివాజీ. ఇంకోటి చెప్పాడు ఇంతకీ జగన్ మీద రవి ప్రకాష్‌కి అంత కోపం ఏంటి? అపుడెపుడో జగన్‌కి రవి ప్రకాష్‌కి మధ్య గొడవ జరిగిందట. అది మనసులో పెట్టుకుని జగన్ అంతు చూస్తానని అన్ పాపులర్ చేయడానికి నన్ను అడ్డం పెట్టుకుని ఈ ప్లాన్ చేశారు. ఇదంతా శివాజీ నాకు చెప్పినా నేను నమ్మలేదు. ఎందుకంటే రవి ప్రకాష్ ఇంత దిగజారిపోతాడని అనుకోలేదు. అసలు శివాజీ ఏ అర్హత ఉందని చంద్రబాబుని తిట్టడానికైనా.. పొగడటానికి. అలాగే జగన్‌ని గురించి మాట్లాడటానికి. ఎందుకు ఈ డబుల్ టంగ్. నేను ఇలా డబుల్ టంగ్‌తో మాట్లాడితే ఎవరైనా నిలదీయొచ్చు. శివాజీ ఇలా పొగడటం, తిట్టడం. ఇన్ని స్వరాలు ఎందుకు మారుస్తున్నాడు. ఏం ఆశించి? కుల పిచ్చా.. డబ్బు తీసుకున్నావా? చెప్పు ఓపెన్‌గా’ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు పోసాని కృష్ణ మురళి. 

No comments:

Post a Comment