మహబూబ్ నగర్, ఏప్రిల్ 8 (way2newstv.in)
మహబూబ్ నగర్ తెరాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా మద్దూర్ మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోతో మద్దూరు పట్టణం జనసంద్రంగా మారింది. అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణ శివార్లలోని ఓ ఫంక్షన్ హాల్ దాకా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో మొదటగా మాజీ ఎమ్మెల్యే తెరాస రాష్ట్ర నాయకుడు గుర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ పట్టుదల, ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ గా మార్చే క్రమంలో కెసిఆర్ పాలన కాలం రాష్ట్ర చరిత్రలోనే స్వర్ణయుగంగా భావితరాలు చెప్పుకుంటాయన్నరు. మన్నె శ్రీనివాస్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పులి తోలు కప్పుకున్న నక్కల కాలం చెల్లిపోయిందని పాలమూరు పులి బిడ్డ మన్నె శ్రీనివాస్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి కొడంగల్ ప్రజానీకం సిద్ధమయ్యారని తెలిపారు.
తెరాస రోడ్ షో తోజనసంద్రమైన మద్దూర్
అనంతరం ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడు అయిన కేసీఆర్ కు రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విషయం లో ఒక బృహత్తరమైన విజన్ ఉందని రానున్న లోక్ సభ కెసిఆర్ నేతృత్వంలో కొలువుతీరడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. తను భారీ మెజారిటీతో గెలిపిస్తే పాలమూరు ను పారిశ్రామికంగా అభివృద్ధి పరచడమే కాక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. అనంతరం రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో 70 శాతం ఉన్న రైతాంగానికి గత ప్రభుత్వాలు చేసింది శూన్యం అని స్వాతంత్రానంతరం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి న ఘనత కెసిఆర్ కె దక్కుతుందన్నారు. రైతుబంధు రైతు బీమా లాంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం సైతం కాపీ కొట్టాలని చూసిందని తెలిపారు. నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలు పాలమూరు ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంలో ఇక్కడి ప్రాంత సమస్యలపై నోరు విప్పక పోవడం దారుణమన్నారు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు లోని ప్రతి గ్రామం యొక్క సమస్యపై అవగాహన ఉందని ఆయనలాంటి రాజనీతిజ్నుడికి అధికారం ఇవ్వాలని దేశం మొత్తం చూస్తోందని, సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కెటీఆర్ కేంద్రంలో కేసీఆర్ కీలక భూమిక వహిస్తారని ఆయన జోస్యం చెప్పారు తెరాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment