Breaking News

09/04/2019

పోలింగ్‌ నిర్వహణ, ఏర్పాట్లపై సీస్ ఎస్కే జోషి సమీక్ష

హైదరాబాద్‌ ఏప్రిల్ 9 (way2newstv.in)
సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో డీజీపీ మహేందర్‌ రెడ్డి, అదనపు డీజీ జితేందర్, సంయుక్త సీఈవోలు అమ్రపాలి, రవికిరణ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 11గురువారం)వ తేదీన ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. 


పోలింగ్‌ నిర్వహణ, ఏర్పాట్లపై సీస్ ఎస్కే జోషి సమీక్ష

నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో మాత్రం ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన 13అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్‌ ఉంటుంది. రాష్ట్రంలో2,97,08,599  మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,49,30,726 మంది పురుషులు.. 1,47,76,370  మంది మహిళలు, 1504 మంది ఇతరులు, 11,320 మంది సర్వీస్ ఓటర్లు 1,731 మంది ఎన్నారై ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలో 34,606 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment