దత్తాత్రేయ తో సహా పలువురి నేతల అరెస్ట్
హైదరాబాద్ ఏప్రిల్ 30 (way2newstv.in)
తెలంగాణ ఇంటర్ మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. అయితే మంగళవారం నాడు బీజేపీ నేతలు ప్రగతిభవన్ ముట్టడికి బీజేపీ కార్యకర్తల యత్నించారు. ప్రగతి భవన్ గేట్ దూకేందుకు బీజేపీ కార్యకర్తల యత్నించగా అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అరెస్ట్ పై ట్యాంక్‌బండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు.
ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ ధర్నా
అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించేందుకు అనుమతులు లేవని, ఇక్కడ ఆందోళనలు చేయవద్దని పోలీసులు తెలిపారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చిన దత్తాత్రేయ, ఇతర బీజేపీ నేతలను సైతం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ..శాంతి యుతంగా నిరసన తెలుపుతున్నా తమను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదన్నారు. తెరాస ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేయడం ప్రతి పౌరుడి హక్కు అని అన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని దత్తన్న చెప్పుకొచ్చారు.
No comments:
Post a Comment