మహబూబ్ నగర్, మార్చి 1, (way2newstv.in)
అనుమతులు లేకుండా గుట్టను తవ్వి కొందరు దందా చేస్తున్నారు. మట్టిని తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ధన్వాడ మండల కేంద్రనికి రెండు కిలోమీటర్ల దూరంలో భారత గట్లు నుంచి గత కొంత కాలంగా జేసీబీలతో తవ్వి ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ఇది తమ పట్టా భూమి అంటూ ఇటుక బట్టీలను పెట్టుకొని వాడుకుంటున్నారు. ఆ స్థలంలో ఫారెస్ట్ ఏరియాను సూచించే బోర్డును అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసినా అవేవీ పట్టించుకోకుండా తవ్వకాలు జరిపారు. అంతే కాకుండా పచ్చని చేట్లను నరికేస్తున్నారు. మట్టిని భూమి సమాంతరంగా తవ్వి వాటిని తమ పొలంలోకి కలిపేసుకుంటున్నారు.
యదేఛ్చగా మట్టి తవ్వకాలు
ఇంత జరుగుతున్నా అటు ఫారెస్ట్ శాఖ అధికారులుగాని, ఇటు రెవెన్యూ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్కడి నుంచో ఇటుకకోసం మట్టిని తె చ్చుకుంటూ వాటికి డబ్బులు ఎందుకు ఖర్చు పెటలనుకున్నారో ఏమో ఏకంగా గుట్ట దగ్గరే మకాం పెట్టేశారు. ఇటుక బ ట్టీ యజమనులు వ్యాపారం మూడు పు వ్వులు ఆరు కాయలుగా ఉంది. ఒక ఇ టుకకు రూ.5 నుంచి రూ.15వరకు అ మ్ముతున్నారు. అంటే వేయ్యి ఇటుకలకు రూ.5వేలు పలుకుతుంది. మండలంలో దాదాపు నాలుగు ఇటుక బట్టీలు ఏర్పా టు చేసుకున్నారు. వీటికి ఎక్కడా అనుమతులు తీసుకోవడంలేదు. ప్రధాన రా హదారులకు పక్కనే ఉన్నా అధికారులు అటునుంచే రాకపోకలు చేస్తున్నారు. మండలంలో ఎక్కడా ఎర్రమట్టి కావాల్సినా భారత గుట్టనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఒక్క ట్రాక్టర్ ట్రీప్‌కు రూ.400 నుంచి రూ.600 వసూలు చేస్తున్నారు. పొలాలకు వేళ్లే రాహదారిని తవ్వడంతో బాటలేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
No comments:
Post a Comment