ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్..హత్య
మేడ్చల్, మార్చి 22, (way2newstv.in)
మేడ్చెల్ జిల్లా అల్వాల్ తుర్కపల్లి లోని ఏ.ఆర్. హోమ్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ళ ప్రవళిక అనే బాలిక పై ఇంటి పక్కనే ఉండే బీహార్ కు చెందిన వ్యక్తులు అత్యాచారం చేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. అనంతరం పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలో బాలిక మృతదేహాన్ని పడేసారు. ఉదయం నుండి ఇంటి పక్కన ఉన్న స్నేహితులతో హొలీ పండుగ జరుపుకున్న చిన్నారి, మధ్యాహ్నం 3 గంటల నుండి కనిపించకుండా పోయింది.
హోళీనాడు దారుణం
తల్లీదండ్రులు చుట్టు పక్కల ఎంత వెతికిన కనిపించక పోవడంతో రాత్రి 7 గంటల సమయంలో అల్వాల్ పోలీసులకు పిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇంటి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ చుట్టూ గాలిచంగా బాలిక మృతదేహం కనిపించింది. పోలీసులు వెంటనే డాగ్ స్క్వాడ్ ,రప్పించి తనిఖీలు చేసారు. కుక్కలు నేరుగా ప్రవళిక ఇంటి పక్కనే ఉన్న బీహార్ కు చెందిన వ్యక్తుల ఇంటికి వెళ్లాయి. పోలీసులు బిహార్ కు చెందిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
No comments:
Post a Comment