Breaking News

25/02/2019

డిప్యూటీ స్పీకర్‌గా టీ పద్మారావు గౌడ్‌

హైద్రాబాద్, ఫిబ్రవరి 15 (way2newstv.in
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా టీ పద్మారావు గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన టీ పద్మారావుగౌడ్‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాల నుంచి పద్మారావుతో ఉన్న అనుబంధం మరిచిపోలేనిది అని తెలిపారు. రెండుసార్లు కార్పొరేటర్‌గా ఆయన ఎన్నికయ్యారు. కార్పొరేటర్ పదవి వదులుకొని 2001లో టీఆర్‌ఎస్‌లో చేరారు. జంట నగరాల నుంచి ఉద్యమాన్ని నడిపిన నాయకుడు పద్మారావు. పద్మారావు ప్రజలతో మమేకమయ్యే తీరు అందరికి ఆదర్శం. పరేడ్ గ్రౌండ్‌లో టీఆర్‌ఎస్ నిర్వహించిన తొలి సభకు రేయింబవళ్లు కష్టపడి పని చేసి ఆ సభను విజయవంతం అయ్యేలా పద్మారావు కృషి చేశారు. జంట నగరాల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 


డిప్యూటీ స్పీకర్‌గా టీ పద్మారావు గౌడ్‌

హైదరాబాద్‌లో కల్లుదుకాణాలు మూసివేయొద్దంటూ సమైక్య రాష్ట్రంలో ఆయన పోరాడారు. గత 20 ఏళ్ల నుంచి పద్మారావుతో ఉన్న అనుబంధం మరిచిపోలేనిది కేసీఆర్ తెలిపారు. పద్మారావు వల్లే కల్లు దుకాణాలు మళ్లీ తెరుచుకున్నాయని కొనియాడారు. 2001లో కార్పొరేటర్ పదవి వదులుకొని ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారని.. జంట నగరాల నుంచి ఉద్యమాన్ని నడిపిన నాయకుడని సీఎం పేర్కొన్నారు. పద్మారావు ప్రజలతో మమేకమయ్యే తీరు అందరికీ ఆదర్శమని ప్రశంసించారు. తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు గౌడ్‌ ఎంపికైన సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. తన వివాహానికి సంబంధించి ఆసక్తికర వివరాలు వెల్లడించారు. తన ప్రేమ వివాహానికి అత్తమామలు ఒప్పుకోకపోతే పద్మారావే పెద్దన్న పాత్ర పోషించి పెళ్లి జరిపించారని బాల్క సుమన్ తెలిపారు. ‘ఉద్యమ సమయంలో నేను ఉస్మానియా యూనవర్సిటీలో ఉన్నా. ఆ సమయంలో పజ్జన్న నాకు వెన్నుదన్నుగా నిలిచారు. పలు సందర్భాల్లో సహకారాన్ని అందించి అండగా నిలిచారు’ అని బాల్క సుమన్ చెప్పుకొచ్చారు. ‘2012లో నా పెళ్లి చేసింది పద్మారావు అన్ననే. నా అత్తమామ పెళ్లికి ఒప్పుకోకపోతే.. పద్మారావు అన్న పెద్ద మనసుతో 3 నెలల కాలంలో రెండు విడుతలుగా వారితో మాట్లాడారు. చివరికి వారిని ఒప్పించి మాకు ప్రేమ వివాహం జరిపించారు. దగ్గరుండి పెళ్లి చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మరోసారి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నా’ అని బాల్క సుమన్ అన్నారు. పద్మారావు డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికవడం సంతోషంగా ఉందని బాల్క సుమన్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖలను ఆయన సమర్థంగా నిర్వహించారని కొనియాడారు

No comments:

Post a Comment