అమరావతి, ఫిబ్రవరి 26 (way2newstv.in)
పార్టీ ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఓనమాలు నేర్చుకోలేదు. రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తరువాత ప్రజల తరుపున ప్రజా సమస్యల పై పోరాడితేనే పార్టీకి గుర్తింపు వస్తుందని ఇంకా ఆయనకు అవగాహన కలిగినట్లు లేదని ఉప ముఖ్యమంత్రి కే ఈ కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం అయన మీడయాతో మాట్లాడారు. ప్రజా స్వామ్యంలో ప్రజా సమస్యలు పరిష్కారించడానికి అసెంబ్లీయే సరైన వేదిక. అసెంబ్లీకి హాజరుకాని జగన్ కు రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదు. అధికారంలోకి రావాలంటే డబ్బు మూటలు, ప్రశాంత్ కిషోర్ లాంటి సలహాదారులు, కేటీఆర్ లాంటి అద్దె మైకులు ఉంటే చాలని జగన్ భావిస్తున్నట్లు వున్నారని అన్నారు. ఇటీవల కెటిఆర్ పత్రికా సమావేశాలు చూస్తుంటే ఆయనేమైనా వైకాపా కి అధికార ప్రతినిధిగా నియమించబడ్డాడా అని అనుమానం కలుగుతుంది. బహుశా ప్రజలు తన మాట నమ్మేస్థితి లేదని ప్రతిపక్ష నాయకుడు జగన్ భావిస్తున్నట్లు వున్నారు.
వైకాపా అధికారంలోకి రావడం కల్ల
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసిన తరువాత అధికారంలోకి రాలేమని జగన్ కి క్లారిటీ వచ్చింది. దాంతో దిగులు పట్టుకుంది. ప్రజల మీద కోపంతో పక్క రాష్ట్రంలో కూర్చొని కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయుస్తానన్నట్లు వుంది తలసాని వ్యవహారమని అన్నారు. తన రాష్ట్రంలో 26 కులాలను బిసి జాబితా నుంచి తొలగించినా, బడ్జెట్ లో బిసిలకు గతంలో కన్నా వంద కోట్లు తగ్గించినా నోరు తెరవని తలసాని ఇక్కడకు వచ్చి బిసిల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. బిసి సబ్ ఫ్లాన్ కింద విడుదల చేసిన నిధులలో 30 శాతం కూడా ఖర్చు చేయలేని వాళ్లా మాకు సలహాలు ఇచ్చేది. రాష్ట్రంలో వైకాపా గెలవడం కల్ల. టిఆర్ఎస్, బిజెపి నాయకులు ఎన్ని డబ్బు మూటలు పంపించినా గబ్బు పట్టడం ఖాయం.
మీ కుతంత్రాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించారు. కేసీఆర్ దొడ్డి దారిన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలని చూస్తున్నారు. ఎన్ని కుతంత్రాలు చేసిన వారి సామంత రాజు జగన్ ను గెలిపించుకోలేరు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకురారని కేసీఆర్ కి బాగా తెలుసు. ఇలా జరిగితే మొదటి లబ్ది పొందే వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. గత ఐదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో చెప్పుకోతగిన పరిశ్రమ ఒక్కటి రాలేదు. చంద్రబాబు అధికారంలో ఉండగా పారిశ్రామిక వేత్తలు తెలంగాణ లో అడుగుపెట్టడం కష్టమని కేసీఆర్ గుర్తించారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి చట్టబద్దంగా రావాల్సిన నిధులు ఎగ్గొట్టవచ్చని టి.ఆర్.ఎస్ భావిస్తుంది. కేసీఆర్ కి ఊడిగం చేస్తున్న జగన్ అధికారంలోకి వస్తే పోలవరం, రాజధాని నిర్మాణం ఆగిపోతుందని రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకున్నారని అయన అన్నారు.
No comments:
Post a Comment