Breaking News

23/02/2019

శ్రీనివాస్ వి అన్నీ కట్టు కధలే

మంగళగిరి, ఫిబ్రవరి 23 (way2newstv.in
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మంగళగిరిలో జ్యోతి హత్యకేసు అనేక మలుపుల అనంతరం ప్రియుడే నిందితుడని దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో నిందితులను పోలీసులు శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ విజయారావు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జ్యోతి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రియుడు శ్రీనివాస్‌‌ను అరెస్ట్‌ చేశామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జ్యోతి, శ్రీనివాస్‌లకు ముందు నుంచే పరిచయం ఉందని, ఈ పరిచయం ప్రేమగా మారిందన్నారు. అలాగే ఏళ్ల తరబడి స్నేహంతో వాళ్లు మరింత దగ్గరయ్యారని ఎస్పీ తెలిపారు. అలాగే శ్రీనివాస్‌ స్నేహితుడు కటారి పవన్‌కల్యాణ్ కూడా జ్యోతికి తెలుసని వెల్లడించారు. ఘటన జరిగిన రోజు జ్యోతికి శ్రీనివాస్‌ మెసేజ్ పెట్టాడని ఎస్పీ వివరించారు. 


శ్రీనివాస్ వి అన్నీ కట్టు కధలే 

జ్యోతిని హతమార్చడానికి పథకం వేసిన శ్రీనివాస్, ఇందుకు తన స్నేహితుడు పవన్ కల్యాణ్ సాయం కోరాడని ఆయన తెలియజేశారు. ఘటన జరగడానికి ముందు ఇద్దరు కలిసున్న సీసీటీవీ ఫుటేజీ లభించిందని అన్నారు. నవులూరు స్టేడియం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి జ్యోతిని రప్పించిన శ్రీనివాస్‌, తన స్నేహితుడి సాయంతో దారుణంగా హత్య చేశాడు. బలమైన ఇనుప రాడ్డుతో జ్యోతిపై శ్రీనివాస్‌, పవన్‌ దాడి చేయడంతో ఆ దెబ్బలు తాళలేక ఆమె చనిపోయిందని ఎస్పీ వెల్లడించారు. నిజాలు దాచిపెట్టి, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులిద్దరూ పలు వ్యూహాలు రూపొందించారన్నారు. ఇందులో భాగమే ఎవరో వచ్చి దాడి చేశారని శ్రీనివాస్‌ కథలు చెప్పాడు. అందర్నీ నమ్మించేందుకు తాను కూడా బలమైన గాయం చేసుకున్నాడు. తనపై ఎవరికీ అనుమానం రాకుండా దాదాపు 10 అంగుళాల మేర గాయం చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు. అతడిపై అనుమానాలు రావడంతో మొదట దానిపై దృష్టిసారించామని ఎస్పీ తెలిపారు. పెళ్లి చేసుకోమని జ్యోతి ఒత్తిడి చేయడంతోనే హత్యకు కుట్ర పథకం వేశాడని అన్నారు. జ్యోతి కాళ్లు, చేతులు శ్రీనివాస్‌ పట్టుకుంటే ఇనుపరాడ్‌తో ఆమె తలపై పవన్‌ కొట్టాడని, అనుమానం రాకుండా ఉండాలని పవన్‌ తలపైనా దాడిచేశాడని అన్నారు. అనంతరం ఆ ఇనుప రాడ్‌ను తాడేపల్లిలోని ఓ కాలువలో పడేశాడని, హత్యకు వారం రోజులు ముందు నుంచే నిందితులు రెక్కీ నిర్వహించినట్టు తెలియజేశారు. పథకం ప్రకారమే అమరావతి టౌన్‌షిప్‌లో జ్యోతిని హత్యచేసినట్టు నిందితుడు అంగీకరించాడు. 

No comments:

Post a Comment