Breaking News

08/02/2019

కొత్తగూడెంలో భూప్రకంపనలు

భద్రాద్రి, ఫిబ్రవరి 8, (way2newstv.in)
భద్రాద్రి జిల్లాలో గురువారం అర్ధరాత్రి భూమి స్వల్పంగా కంపించింది.  నిద్రపోతున్న వారు ఒక్కుదుటున లేచి బయటకు పరుగులు పెట్టారు. 


కొత్తగూడెంలో భూప్రకంపనలు

 రాత్రి 11:23 గంటల సమయంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కొత్తగూడెంతో పాటు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, జూలూరుపాడు, ఇల్లెందు, పాల్వంచ ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. మళ్లీ ఎక్కడ వస్తుందోనని రాత్రంతా జాగారం చేశారు. ఐదు నెలల  క్రితం కూడా భూమి కంపించింది. .. అయితే, అధికారులు మాత్రం అది భూకంపం కాదని, కేవలం చిన్నపాటి ప్రకంపనలేనని చెబుతున్నారు.

No comments:

Post a Comment