Breaking News

08/02/2019

వినతులపై తక్షణ స్పందనం

వినతులపై తక్షణ స్పందనం
కర్నూలు, ఫిబ్రవరి, 08 (way2newstv.in)
సమస్యల పరిష్కరార్ధం వివిధ మార్గాల ద్వారా అందే ప్రజా వినతులను వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశం అధికారులను  ఆదేశించారు. శుక్రవారం  కలెక్టరేటులోని కాన్ఫరెన్స్ హాలు లో  డయల్ యువర్ కలెక్టరు కార్యక్రమం జరిగింది. వివిధ సమస్యల పరిష్కరార్ధం 18 ఫోన్ కాల్స్ అందాయి. అనంతరం డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కరంలో అలసత్వం పనికిరాదన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నిర్దేశించిన విధులను తుచా తప్పకుండా పాటించాలని అధికారులతో అన్నారు.


వినతులపై తక్షణ స్పందనం

 తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు వారి పే స్కేళ్లతో పాటు వెంటనే అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేద్రంలో ప్రతి శనివారం ఓటరు జాబితాతో బిఎల్ ఓలు ఉంటారని, ఆయా పోలింగ్ కేంద్రం పరిధిలోని ప్రజలు అక్కడికి వెళ్లి తమ పేరు ఓటరు జాబితాలో వుందా లేదా అని పరిశీలించుకోవచ్చునని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో తాగునీరు, ర్యాంపు, విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలు వున్నాయా లేవా అని పరిశీలించుకుని లేకపోతే వెంటనే వాటి నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఏఒ వెంకటరమణ, జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment