Breaking News

04/09/2018

ఇద్దరు దోషులు..ముగ్గురిపై ఆధారాల్లేవు జంట పేలుళ్ల పై కోర్టు తీర్పు

హైదరాబాద్, సెప్టెంబర్ 4, (way2newstv.in)
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిలో ఇద్దరిని దోషులుగా  ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది.  మరో ముగ్గురిపై ఆధారాలు లేవని తీర్పు చెప్పింది. ఈ కేసులో ప్రస్తుతం హైదరాబాద్ చర్లపల్లి జైల్లో ఉన్న మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి యాకుబ్ అలియాస్ వినోద్ పాటిల్,  అనీక్ షఫీక్ సయీద్ లు దోషులని న్యాయమూర్తి మంగళవారం నాడు   ప్రకటించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఫరూక్ శర్ఫుద్దీన్ తర్కాష్ అలియాస్ అబ్దుల్లా శర్ఫుద్దీన్ తర్కాష్,  మహమ్మద్ సాధిక్ ఇజ్రార్ అహ్మద్ షాహి అలియాస్ యాసిర్ అలియాస్ ఇమ్రాన్.  తారిక్ అంజుమ్ లను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది.  ఇదే కేసులో పరారీలో ఉన్న నిందితులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ లపై విచారణ కొనసాగుతుందని తెలిపారు.  2007లో గోకుల్ చాట్, లుంబినీ పార్క్ లలో జంట పేలుళ్లు జరుగగా, 44 మందికి ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. కొన్ని వందల మంది జీవితాలపై బాంబు పేలుడు ప్రమాదం ప్రభావాన్ని చూపింది. ఎంతో మంది తమ అవయవాలను కోల్పోయి ఇప్పటికీ జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు.తీర్పు సంధర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కుషాయిగూడ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ జైలుకు చేరుకుని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. 



ఇద్దరు దోషులు..ముగ్గురిపై ఆధారాల్లేవు
జంట పేలుళ్ల పై కోర్టు తీర్పు

No comments:

Post a Comment