Breaking News

26/07/2018

జగన్ వ్యూహాత్మకంగానే కామెంట్స్

విజయవాడ జూలై 26, (way2newstv.in)
రాష్ట్రంలో రాజ‌కీయ సంచ‌ల‌నం! ఎన్న‌డూ ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రాజ‌కీయ భూకంపం. వైసీపీ అదినేత జ‌గ‌న్ నోటి నుంచి తీవ్ర వ్యాఖ్య‌లు. అది కూడా ఇప్ప‌టి వ‌రకు క‌నీసం టార్గెట్ చేయ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ను దుమ్ము దులిపేశా రు. వ్య‌క్తిగత విష‌యాల‌ను స్పృశించారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నార‌ని అన‌బోయో.. ఏమో…. న‌లుగురు పెళ్లాలున్నారు అంటూ ఉతికి ఆరేశారు. నిజానికి జ‌గ‌న్ ఇలా రియాక్ట్ అవుతారని కానీ, జ‌గ‌న్ నోటి నుంచి ఇంత తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక వ్యాఖ్య‌లు వినాల్సి ఉంటుంద‌ని కానీ ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. అయితే, రాజకీయాల‌న్నాక ఏమైనా జ‌ర‌గొచ్చు. నేత‌లు ఏ విధంగా మాట్లాడినా దానికో రీజ‌న్ ఉంటుంది. జగన్ వ్యూహాత్మకంగానే కామెంట్స్

పక్కా వ్యూహం లేకుండా ఏ పార్టీ అధినేత కూడా ముందుకు అడుగులు వేస్తున్న ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు.మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఏపీలో మ‌రిన్ని రాజ‌కీయ ప‌రిణామాలు ఎదురు కావ‌డం త‌థ్యంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ త‌న వ్యూహాత్మ‌క అడుగుల్లో భాగంగా.. వేసిన తొలి అడుగుగా.. తాజా ప‌రిణామాల‌ను పేర్కొన‌వ‌చ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్ అన్న పాయింట్ల‌ను తీసుకుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ఏపీకి అన్యాయం చేసింద‌ని అంటే.. ఆ పార్టీకి నైతిక మ‌ద్ద‌తు ఇచ్చాన‌ని, అధికారంలోకి తెచ్చాన‌ని చెబుతున్న ప‌వ‌న్ అంత‌క‌న్నా ఎక్కువ ద్రోహ‌మే చేసి ఉండాలి. రాష్ట్ర ప్ర‌భుత్వానికి, ముఖ్యంగా చంద్ర‌బాబుకు అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన ప‌వ‌న్‌.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో సాధించింది గోరంత కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న ఎప్పుడు రాజ‌కీయాలు చేసిన ట్విట్ట‌ర్‌కే ప‌రిమితం.ఇంకా చెప్పాలంటే ప‌వ‌న్‌ ఒక స‌భో స‌మావేశ‌మో పెట్టి అక్క‌డితోనే ప‌రిమితం. చంద్ర‌బాబును నిల‌దీసింది కానీ, చంద్ర‌బాబుపైనైనా పోరు చేసింది కానీ లేదు. పైకి మాత్రం తాను నేను ప్ర‌శ్నించ‌డానికే వ‌చ్చాను అని చెబుతున్న ప‌వ‌న్‌.. ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు వేసిన ప్ర‌శ్న‌ల‌కు బాబునుంచి స‌మాధానం రాలేదు. పోల‌వ‌రంపై శ్వేత ప‌త్రం ఇవ్వ‌మ‌న్నారు.. ప్ర‌భుత్వం అన్నీ ఆన్‌లైన్‌లో ఉన్నాయి చూసుకోమంది. శ్రీకాకుళం కిడ్నీ బాధితుల ప‌రిస్థితేంట‌ని ఓ రోజు దీక్ష కూడా చేశారు. అయినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తుందుర్రు ఆక్వా ప‌రిశ్ర‌మ కాలుష్యంపై పోరు చేస్తాన‌న్నాడు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ విష‌యాన్నే మ‌రిచిపోయారు. ఇవి లోక‌ల్ విష‌యాలు. ఇక‌ ప్రత్యేక హోదా కోసం జాతీయ పోరాటాల‌ను చేద్దామ‌ని, మీరు ముందు న‌డ‌వండి నేను వెన‌కాల వస్తాను అన్నాడు. ఇప్ప‌టికీ అడ్ర‌స్ లేదు.పోనీ.. ప‌వ‌న్ చెబుతున్న‌ట్టుగా పోరాటానికి, రాష్ట్ర ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దడానికి అధికార‌మే అక్క‌ర్లేదు కాబ‌ట్టి.. తానేమన్నా వెళ్లి.. పార్ల‌మెంటు వీధిలో ఓ టెంట్ వేసుకునో.. రోడ్డు మీద‌నో దీక్ష చేయొచ్చు. ఏపీ ప్ర‌యోజ‌నాల‌కు క‌ట్టుబ‌డొచ్చు. కానీ, అలా ఇప్పటి వ‌ర‌కు చేసిన పాపాన పోలేదు. ఇక‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా.. కొర్రీలు పెట్ట‌డం, జ‌గ‌న్ అధికారం కోసం త‌హ‌త‌హ లాడుతున్నాడ‌ని అన‌డం వంటివి రాజ‌కీయంగా జ‌గ‌న్‌ను బాధ‌పెట్టేవే. అకార‌ణంగా.. విప‌క్షంపై విప‌క్షం పోరాటం చేసుకోవ‌డం ఏపీలోనే క‌నిపించింది. జ‌గ‌న్ త‌న విశ్వ‌రూపం చూపించారు. వ్య‌క్తిగ‌తంగా స‌చ్చీలుడా ? అని ప్ర‌శ్నించ‌డంలోనే ప‌వ‌న్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. ఈ ప‌రిణామంతో నైనా త‌నేంటో.. త‌న స్థాయేంటో ప‌వ‌న్ తెలుసుకుంటే.. బెట‌రే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే ప‌వ‌న్‌.. చంద్ర‌బాబు వైసీపీ ఎమ్మెల్యేల‌ను, ఎంపీలను సంత‌లో ప‌శువుల‌ను కొన్న‌ట్టు కొంటే ప‌వ‌న్ ఏం చేసిన‌ట్టో చెప్పాలి ? ఒక‌వేళ వైసీపీని విమ‌ర్శించాల్సి వ‌స్తే.. టీడీపీ చేసిన అన్యాయాన్ని కూడా ప్ర‌శ్నించాలి. అంతేకానీ.. ఏక‌ప‌క్షంగా కాదు క‌దా?! ఇదే ఆవేద‌న ఇప్పుడు జ‌గ‌న్ వ్యాఖ్య‌ల్లో అగ్ని జ్వాల‌ల‌ను రేపింది. స‌భ‌కు వెళ్ల‌లేద‌ని వైసీపీ ని దెప్పిపొడిచే వామ‌ప‌క్షాలు కానీ.. ఓ వ‌ర్గం మీడియా కానీ చంద్ర‌బాబు చేసింది అన్యాయ‌మ‌ని చెప్ప‌డానికి నోళ్లు రాక‌పోవ‌డంపైనా జ‌గ‌న్ ఈ ఒక్క వ్యాఖ్య‌తోనే స‌మాధానం చెప్పాడ‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. రాబోయే రోజుల్లో రాజ‌కీయాలు మ‌రిన్ని ట‌ర్న్‌లు తీసుకోవ‌డం ఖాయం!

No comments:

Post a Comment