లక్నో, జూన్ 15(way2newstv.in)
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేరుతో మామిడి పండ్లు వచ్చే్స్తున్నాయ్. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ తర్వాత అమిత్‌షాకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని మలిహబాద్‌కు చెందిన ‘మ్యాంగో మ్యాన్’ హజీ కలిముల్లా రూపొందించిన సరికొత్త మామిడి పండ్లకు ‘షా’ అని పేరు పెట్టారు. ‘మంచి బరువు, రుచి ఉండే ఈ మామిడి పండుకు ‘షా’ పేరు పెట్టారు.
యూపీలో అమిత్ షా మామిడి పండ్లు...
ఈ సరికొత్త మామిడి వంగడాన్ని త్వరలోనే మార్కెట్లో విక్రయిస్తాం. ఈ మామిడి పండు తప్పకుండా ఆయనకు నచ్చుతుంది’’ అని తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కలిముల్లా విభిన్న రకాల మామిడి వంగడాలను పండిస్తూ గుర్తింపు పొందారు. 2015లో ఓ అరుదైన మామిడి పండుకు ఆయన ప్రధాని మోదీ పేరు పెట్టారు. ఆయన తోటలో ఒకే చెట్టుకు 300 రకాల మామిడి పండ్లు కాస్తున్నాయంటే.. అతను ఎంత క్రియేటివ్‌గా మామిడి వంగడాలను సృష్టిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.
No comments:
Post a Comment