Breaking News

02/03/2019

వైసీపీలోకి దాడి వీరభద్రరావు

కాకినాడ, మార్చి 2, (way2newstv.in)
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీలోకి మరో మారు వచ్చేస్తున్నారు. ఆయనకు ఇపుడు ఆ పార్టీ తప్ప వేరే ఆప్షన్ లేదనుకోవాలి. నిజానికి గత ఎన్నికలపుడు దాడి వైసీపీలోనే ఉన్నారు. 2012ల దాడి వీరభద్రరావు హైదరబాద్ లోని చంచల్ గూడా జైలకు వెళ్ళి మరీ జగన్ని కలిసారు. ఆ తరువాత గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో దాడి కుమారుడికి విశాఖ పశ్చిమ సీటుని జగన్ కేటాయించారు. ఆ ఎన్నికల్లో దాడి కొడుకు పరాజయం పాలు అయ్యారు. ఆ మరుసటి రోజే జగన్ని తిడుతూ దాడి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అయిదేళ్ల కాలంలో ఆయన వేరే ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. మధ్యలో టీడీపీలోని వెళ్తారని అనుకున్నా కుదరలేదు. ఇక గత ఏడాది జనసేనాని పవన్ కళ్యాణ్ స్వయంగా దాడి ఇంటికి వెళ్ళి మరీ పార్టీలో చేరమని ఆహ్వానించారు. ఓ దశలో ఆ పార్టీలోకి వెళ్దామని దాడి అనుకున్నా ఆ పార్టీ తీరు చూసి మనసు మార్చుకున్నారని అంటారు.ఇక దాడి వీరభద్రరావుని ఎమ్మెల్యెగా పోటీ చేయమని జగన్ కోరుతున్నట్లుగా భోగట్టా. 


 వైసీపీలోకి దాడి వీరభద్రరావు

దాడి మాత్రం తన కుమారుడికి టికెట్ ఇవ్వమని కోరుతున్నారు. కానీ జగన్ మాత్రం దాడి పోటీ చేస్తానంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని, కుమారుడికి పార్టీ పదవి కట్టబెడతామని కచ్చితంగా చెబుతున్నారు. దాంతో దాడి దీని మీద కొంత తర్జన భర్జన పడ్డాక చివరకి తానే పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు ఆయన అత్మీయ సమావేశాన్ని కార్యకర్తలతో ఏర్పాటు చేస్తే వారంతా దాడి ఏ పార్టీలో చేరినా తమ మద్దతు ఉంటుందని చెప్పారు. దాంతో దాడి వైసీపీలో చేరేందుకు సిధ్ధపడుతున్నారు. ఈ సంధర్భంగా దాడి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయన జగన్ పార్టేలోకి రావడం ఖాయమని చెబుతున్నాయి. చంద్రబాబుని విమర్శించడంతో పాటు, ఆ పార్టీలో చేరాలనుకుంటున్న మరో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణనూ కూడా దాడి ఘాటుగా విమర్శించారు.దాడి వైసీపీలో చేరితే అనకాపల్లిలో పోటీ రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు. ఇక్కడ పోటీ దాడికి, కొణతాల వియ్యంకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణల మధ్యనే ఉంటుందన్నది తెలిసిందే. ఇక కాంగ్రెస్ తరఫున గంటా బంధువు పరుచూరి భాస్కర రావు పోటీ పడుతున్నారు. జనసేన నుంచి గవర సామాజిక వర్గానికే చెందిన కొణతాల సీతారాం పోటీకి రెడీ అవుతున్నారు. అనకాపల్లి రాజకీయాల్లో దాడికి మంచి పట్టు ఉంది. దానికి తోడు వైసీపీకి కూడా కొంత సానుకూలత ఉంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉంది. ఇవన్నీ కలసి దాడికి ప్లస్ పాయింట్లుగా మారే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే దాడి రాకతో రూరల్ జిల్లాలో వైసీపీకి గట్టి పట్టు దొరికినట్లైంది

No comments:

Post a Comment