విశాఖపట్టణం, మార్చి 2, (way2newstv.in)
ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేరింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోంచి కొంత, సౌత్ సెంట్రల్ లోంచి కొంత భాగాలు విడదీసి కొత్తగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే అదే సమయంలో మరో విషయం కూడా వెల్లడించింది. ప్రస్తుతం వున్న వాల్తేరు (విశాఖ) జోన్ ను రెండుగా విడదీసి, కొత్తగా రాయగడ (ఒరిస్సా) జోన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పేసారు.ఇన్నాళ్లు వైజాగ్ జోన్ ఏర్పాటుకు వస్తున్న సమస్య అదే. వాల్తేర్ జోన్ లో వున్న ఆంధ్ర భాగం తక్కువ. ఒరిస్సా భాగం ఎక్కువ. పైగా అతి కీలకమైన ఐరన్ ఓర్ తరలింపు వల్ల వచ్చే ఆదాయం చాలా ఎక్కువ.
జోన్ విధివిధానాలు పై రాని క్లారిటీ
అన్నీ ప్రభుత్వ విభాగాలే అయినా, ఈ ఆదాయం పోకూడదు, ఆ జోన్ మీద పెత్తనం పోకూడదు అనే ఉద్దేశంతో రైల్వే లోని ఒరిస్సా లాబీయింగ్ వర్గాలు దాన్ని ఆపుతూ వచ్చాయి.ప్పుడు విధి విధానాలు బయటకు రాలేదు కానీ, రాయగడ జోన్ ఏర్పాటు అన్నది మాత్రం తెలిసింది. మరి ఈ రాయగడ జోన్ లో ఏయేభాగాలు వుంటాయి. వాల్తేర్ డివిజన్ లో వున్న విశాఖ నుంచి ఆంధ్ర బోర్డర్ ఇచ్చాపురం వరకు కొత్త సౌత్ కోస్ట్ జోన్ లోకి తెస్తారా? అలా తెస్తే, అరకులోయ దాటిన తరువాత వున్న కిరండోల్ లైన్, ఐరన్ ఓర్ తరలింపు కోసం ఏర్పాటు చేసిన లైన్ అంతా రాయగడ జోన్ లోకి తీసుకెళ్తారా? అలా చేస్తే, సరుకు రవాణా ఆదాయ పరంగా కొత్త జోన్ అయిన సౌత్ కోస్ట్ కు పెద్దగా ప్రయోజనం వుండదు.జోన్ లోకి వచ్చే ప్రాంతాలు, విధి విదానాలు అప్పుడే బయటకు వచ్చేలా లేవు. చిత్రమేమిటంటే, ఇన్నాళ్లు ఆంధ్ర ప్రాంతాలు ఒరిస్సా జోన్ లో వున్నాయి. ఇప్పుడు ఆంధ్రకు జోన్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసరికి అందులోని ఒరిస్సా ప్రాంతాలను తీసి, వాళ్లకు వేరే కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు.ఒక విధంగా ఇన్నాళ్లుగా విశాఖ జోన్ ఏర్పాటుకు వున్న అడ్డంకిని కేంద్రం ఈ విధంగా పరిష్కరించిందన్న మాట
No comments:
Post a Comment