Breaking News

22/02/2019

చితికి పోతున్న చిన్న కాంట్రాక్టర్లు

హైద్రాబాద్, ఫిబ్రవరి 13, (way2newstv.in)
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న భారీబడ్జెట్లు.. రాష్ట్రంలో పరోక్షంగా అవినీతికి పెద్దపీట వేస్తున్నాయా..? అంటే అవు ననే అంటున్నాయి అధికారవర్గాలు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ హయాం నుంచి భారీబడ్జెట్ల ప్రహసనం కొనసాగతూ వస్తు న్నది. లక్ష కోట్లనే మాట.. ఇప్పుడు లక్షన్నర కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్‌ ఏకంగా రూ.2 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ భారీ పద్దులే ఇప్పుడు అవినీతికి ఊతమిస్తున్నా యని సమాచారం. వాస్తవ ఆదాయాలు, రాబడులను పరిగణ నలోకి తీసుకోని రాష్ట్ర ప్రభుత్వం.. భారీ స్థాయిలో పద్దులను ప్రవేశపెట్టి ప్రజల్లో అంచనాలను రెట్టింపు చేస్తున్నది. పైగా నెలకోసారి ముఖ్యమంత్రో, ఆర్థికమంత్రో, ఇతర ఉన్నతాధికారు లో తెలంగాణ ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రమంటూ ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వివిధ నిర్మాణ పనులను నిర్వర్తిస్తున్న కాంట్రాక్టర్లు సైతం బడ్జెట్లను చూసి ఆశలు పెంచుకుంటున్నారు. కానీ రాబడుల విషయంలో సర్కారు తన అంచనాలను అందుకోలేకపోవ టంతో నిధుల విడుదల్లోను, బిల్లుల చెల్లింపులో నూ ఇబ్బందులేర్పడుతున్నా యి. 


చితికి పోతున్న చిన్న కాంట్రాక్టర్లు

గత మూడేండ్ల కాలంలో నిర్వహించిన వివిధ పనులకుగాను ఇప్పటి వరకూ బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. దీంతో వందల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించటం ప్రభుత్వానికి కత్తిమీద సామే అవుతున్నది. మరోవైపు బిల్లుల కోసం కాంట్రాక్టర్లు సచివాల యం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ పరిణా మాల వల్ల కొందరు అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఉన్నత స్థాయిలో చర్చిం చకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులు చెల్లిం చొద్దంటూ ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. కానీ అర్థబలం, పరపతి ఉన్న కాంట్రాక్లర్లకు ఈ నిబంధ నలేం వర్తించటం లేదు. వారు తమ బిల్లులను బ్రహ్మాండంగా రాబట్టుకుంటున్నట్టు తెలిసింది. ఇందుకోసం వారు డబ్బును ఎరగా వేస్తున్నట్టు తెలిసింది. ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి వరకు ఈ వ్యవహారం కొనసాగుతున్నట్టు సమాచారం. 
అయినప్పటికీ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కొందరు కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బిల్లుల పరిస్థితి గురించి తెలుసుకునేం దుకు సచివాలయానికి వచ్చారు. 'డబ్బులు విడుదల చేయాలంటూ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పెద్దోళ్లు పట్టించు కోవటం లేదు...' అని ఈ సందర్భంగా వారిలో ఒకరు ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం. మొత్తం మీద భారీ బడ్జెట్లతో ఇటు ప్రజల్లోను, అటు కాంట్రాక్టర్లలోనూ ఆశలు రేపుతున్న సర్కారు.. ఆ స్థాయిలో నిధులు విడుదల చేయకపోవటంతో అంతిమంగా అనేక పర్యవసానాలు చోటు చేసుకుంటున్నా యని ఆర్థికశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

No comments:

Post a Comment